భాగ్యనగరంలో…. ‘శ్రీమంతుడు’

269
Billionaires son struggles in Hyd as common man
- Advertisement -

కోట్ల ఆస్తులు ఉన్నప్పటికీ, కుటుంబ కట్టుబాటు ప్రకారం ఓ వజ్రాల వ్యాపారి కుమారుడు అతి సామాన్యుడిగా హైదరాబాద్‌లో గడిపాడు. అచ్చం  బిచ్చగాడు సినిమాలో హీరో వేల కోట్లకి వారసుడు, కాని సినిమాలో తల్లి బ్రతకాలని ఆశతో నెల రోజుల పాటు బిచ్చగాడిగా తన గుర్తింపుని చంపుకొని బ్రతుకుతాడు. కానీ నిజజీవితంలో కాస్త డిఫరెంట్‌గా జీవితం విలువ తెలియాలని ఆ తండ్రి చేసిన చేసిన ప్రయత్నం ఆ కోటిశ్వరుడిని మనిషిని చేసింది.

జీవితం విలువను అర్థం చేసుకోవడం కోసం ఇంటి పెద్దలు చూపినమార్గంలో పయనించాడు. ఫైవ్‌స్టార్ హోటళ్లలో విలాసాలు అనుభవించిన అతను..రూ.వందకు బెడ్ ఇచ్చే లాడ్జి కోసం వెతికాడు. అమెరికాలో బిజినెస్ మేనేజ్‌మెంట్ చదివి, హైదరాబాద్‌లో సేల్స్‌బాయ్‌గా గడిపాడు.

Billionaires son struggles in Hyd as common manసూరత్ కేంద్రంగా వజ్రాల వ్యాపారం చేసే హరేకృష్ణ ఎక్స్‌పోర్ట్స్ యజమాని ఘన్‌శ్యాం ధోలకియా కుమారుడు హితార్థ్ నెలరోజుల తన అనుభవాలను శుక్రవారం హైదరాబాద్‌లోని తాజ్‌దక్కన్ హోటల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరించాడు. నా పేరు హిరాత్. వయసు 23. అమెరికాలో బిజినెస్ మేనేజ్‌మెంట్ చదివా. సూరత్‌లో నాన్న, తన ముగ్గురు సోదరులు వజ్రాల వ్యాపారం చేస్తారు. కుటుంబ సంప్రదాయం ప్రకారం ప్రతిఒక్కరూ జీవితం విలువ తెలుసుకునేందుకు కొన్నిరోజులపాటు నిరుపేదగా మారాలి. మావాళ్లు 15 ఏండ్లు గా ఈ కట్టుబాటును ఆచరిస్తున్నారు.

కేవలం తండ్రి ఇచ్చిన ఫ్లైట్ టికెట్ జేబులో పెట్టుకొని ఎయిర్ పోర్ట్ కి వెళ్ళిన తర్వాత తాను హైదరాబాద్ కి వెళ్తున్న విషయం హితార్ద్ కి తెలిసింది. విమానాశ్రయంలో దిగిన తరువాత బస్సులో సికింద్రాబాద్ చేరుకున్నాడు. రూ. 100కు ఒక హోటల్ లో మంచం తీసుకుని ఒక్కరోజు మాత్రమే ఉన్నాడు. తాను ఉద్యోగం కోసం వచ్చానని, రైతు కుటుంబీకుడినని చెప్పాడు. ఉద్యోగాలు లభించే ప్రాంతాల గురించి ఒక్కొక్కరూ ఒక్కో సలహాను ఇవ్వగా, ఓ బస్సు కండక్టర్ సూచన మేరకు అమీర్ పేట వెళ్లి ప్రయత్నించాడు.

Billionaires son struggles in Hyd as common man
హైటెక్ సిటీలో ఓ కంపెనీలో చేరి అక్కడ ఇమడలేక, మానేసి మెక్ డీ అనే కంపెనీలో చేరాడు. దాన్నీ మానేసి నైకీలో, ఆడిడాస్ లో వారం చొప్పున పనిచేశాడు. ఆపై సికింద్రాబాద్ లోని వైట్ బోర్డు తయారీ సంస్థలో కుదురుకున్నాడు. కొన్ని రోజులు రిక్షా కార్మికుడితో, మరికొన్ని రోజులు సాధువుతో కలసి ఓ గదిలో బతికాడు. నిత్యమూ రోడ్డు పక్క లభించే ఆహారాన్ని తిన్నాడు. నెల రోజుల తరువాత తానెక్కడున్నానన్న విషయాన్ని వెల్లడించగా, అతని బంధువులంతా ఒక్కసారిగా వాలిపోయి అతని కష్టం చూసి కన్నీరు పెట్టుకున్నారు. తాను ఓ సాధారణ యువకుడిగా కనిపించలేక పోయానని, అయితే, తనకు తారసపడిన వారంతా సాయం చేయాలనే చూశారని హితార్థ్ వెల్లడించారు. ఈ నెల రోజుల జీవితం ఎన్నో పాఠాలను నేర్పిందని అన్నారు.

నాలుగువారాల్లో నాలుగు ఉద్యోగాలు చేసి ఖర్చులు పోగా రూ.4,700 సంపాదించానని తెలిపాడు. తెలంగాణ వాళ్లు చాలా మంచోళ్లు. పాజిటివ్‌గా ఉంటారు.. ఉద్యోగం కోసం వెతికేటప్పుడు బాగా సహకరించారని హిరాత్ కొనియాడారు. మెక్‌డోనాల్డ్స్‌లో ఐదురోజులు పనిచేసి మానేస్తున్నానని చెప్పా, కంపెనీ రూల్స్ ప్రకారం నెలరోజులు పనిచేస్తేనే జీతం ఇస్తారు. నా పరిస్థితి చూసి ఔట్‌లెట్ మేనేజర్ సొంత డబ్బు ఇచ్చారు. రుద్రగుప్త అనే వ్యక్తి సెల్‌ఫోన్ ఇచ్చారు. అమీర్‌పేటకు దగ్గర లాల్‌బంగ్లా సమీపంలో ఉద్యోగం కోసం ఓ ఆఫీసుకు వెళ్లా. నా కథ విన్న ఆమె ఉద్యోగం ఇవ్వలేను. ముందు ఆకలితీర్చుకో అని రూ.500 ఇచ్చారు. ఉద్యోగం దొరికే చిరునామా ఇచ్చారు. అర్జంట్ సార్ అని రిక్వెస్ట్ చేస్తే సిటీలో 17 మంది లిప్టు ఇచ్చారు. అడిగిన వాళ్లలో ఎవరూ కాదనలేదు. హైదరాబాద్ ప్రజలు చాలా పాజిటివ్‌గా ఉంటారు. ఈ విషయం బాగా నచ్చింది అని హితేశ్ అనుభవాలను వివరించారు. గతంలో హితార్థ్ సోదరుడు  ఇదే విధంగా అజ్ఞాతవాసం చేసి కేరళలో కూలీగా పనిచేస్తూ నెల రోజులు గడిపాడు.

Billionaires son struggles in Hyd as common man

- Advertisement -