ఈమధ్యలో బాలికలపై అత్యాచారాలు ఎక్కువవుతున్నాయి. కనీసం రోజు ఒక్క బాలకను అయిన అత్యాచారం చేస్తున్నారు దుండగులు. ఇందులో ఎక్కువగా 12 ఏళ్ల బాలికలే అత్యాచారానికి గురవుతున్నారు. ఇటివలే జరిగిన కఠువా, ఉన్నావ్ ఘటనలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇదే అంశంపై పార్లమెంట్ లో చర్చ జరిగింది. బాలికలపై అత్యాచారాలు చేసిన వారిపై సంచలన నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం.
పన్నేండేళ్లలోపు బాలికలను అత్యాచారం చేస్తే మరణ శిక్షను విధించేందుకు వీలుగా చట్టాన్ని లోక్ సభలో ప్రేవేశ పెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఇందుకు సంబంధించిన చట్టాన్ని అమలులోకి తీసుకువచ్చింది. ఇటివలే జరిగిన కఠువా, ఉన్నావ్ ఘటనల అనంతరం దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లు వెత్తిన విషయం తెలిసిందే. ఇందుకు తగ్గట్టుగా కేంద్ర ప్రభుత్వం పై నిరసనలు వెల్లువెత్తడంతో ఓ ఆర్డినెన్స్ ను జారీ చేసింది.
12 ఏళ్ల లోపు బాలికలను రేప్ చేస్తే మరణశిక్ష, అలాగే 16ఏళ్ల లోపు బాలికలపై అత్యాచారం చేస్తే 20ఏళ్ల జైలు శిక్ష..అంతేకాకుండా మహిళలను రేప్ చేస్తే సుమార్ ఏడళ్ల నుంచి జీవితఖైదు విధించనున్నట్లు బిల్లును పాస్ చేశారు స్పీకర్. రేప్, అత్యాచారం జరిగిన కేసులు నెలల కొద్ది పెండింగ్ పడకుండా రెండు నెలల్లోనే పూర్తి అయ్యేలా చట్టాన్ని పార్లమెంట్ లో ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం.