Bill Gates:ఏపీకి బిల్ గేట్స్

5
- Advertisement -

గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి చేరుకున్నారు. ఆయనకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో పాటు పలువురు మంత్రులు ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రభుత్వం మరియు బిల్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ మధ్య కొనసాగుతున్న భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఈ సమావేశం కీలకంగా నిలిచింది.

సమావేశంలో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో ఇప్పటికే అమలు చేస్తున్న పథకాలు, వాటి పురోగతి, భవిష్యత్ కార్యాచరణపై విస్తృత చర్చలు జరిగాయి. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ లెర్నింగ్ ప్రోత్సాహం, ప్రాథమిక ఆరోగ్య సేవల మెరుగుదల, రైతులకు సాంకేతిక ఆధారిత సలహాలు అందించే విధానాలపై దృష్టి సారించారు.

రాష్ట్రంలో అమలవుతున్న పలు పైలట్ ప్రాజెక్టులను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించే అంశంపై కూడా చర్చించినట్లు సమాచారం. ప్రజలకు నేరుగా లాభం చేకూరే విధంగా సాంకేతికతను వినియోగించడం, డేటా ఆధారిత పాలనను బలోపేతం చేయడం అవసరమని సమావేశంలో అభిప్రాయపడ్డారు. ఈ భేటీతో రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలకు అంతర్జాతీయ స్థాయి మద్దతు మరింత పెరగనుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.

Also Read:నాగబంధం..బైరాగిగా గరుడ రామ్‌

- Advertisement -