బికినీలతో దీపికా.. కలిసొస్తుందా ?

144
- Advertisement -

హీరోయిన్ దీపికా పడుకోణె హంగామా గతంతో పోల్చుకుంటే గత ఐదేళ్ల నుంచి తగ్గుతూ వచ్చింది. ఐతే, బాలీవుడ్ మెగాస్టార్ షారుక్ ఖాన్ పఠాన్ సినిమాతో ఇటీవల దీపికా పడుకోణె రేంజ్ మళ్లీ పెరిగింది. ఈ సినిమాతో దీపికా మళ్లీ మంచి ఊపులోకి వచ్చింది. పైగా చాలా గ్యాప్ తర్వాత ఆమె మరోసారి రేపు పఠాన్ సినిమా ద్వారా ప్రేక్షకులను పలకరిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ చూస్తే ఈ అమ్మడు అందచందాల ప్రదర్శనలో విచ్చలవిడిగా రెచ్చిపోయింది అనిపిస్తోంది.

మూడు నిమిషాల పాటలోనే దీపికా పడుకోణె 6 సార్లు బికినీ వేసుకొని దర్శనం ఇచ్చింది. పైగా, కాషాయపు రంగు బికినీ ధరించి.. హిందుత్వ వాదుల చేత తిట్లు కూడా తింది. ఐతే, పఠాన్ సినిమా మొత్తంలో దీపికా పడుకోణె ఐదు లిప్ కిస్ లు, నాలుగు బికినీ సీన్స్ చేసిందని టాక్ నడుస్తోంది. ఈ లెక్కన దీపికా పడుకోణె ఈ సినిమాలో ఏ రేంజ్ లో అందాలను ఆరబోసిందో, ఎంత హాట్ గా కనిపించబోతుందో ఊహించుకోవచ్చు. అలాగే షారుఖ్ ఖాన్ తో ముద్దు సీన్లు కూడా ఎక్కువే చేసినట్లు కనిపిస్తోంది.

అందుకే, పఠాన్ సినిమా కోసం ప్రేక్షకులు ఎగబడుతున్నారు. మొత్తానికి దీపికా పడుకోణె పఠాన్ స్థాయిని పెంచింది. అడ్వాన్స్డ్ బుకింగ్స్ విషయంలో కూడా పఠాన్ సరికొత్త రికార్డ్స్ ను క్రియేట్ చేసింది. అయితే, ఈ భారీ ఓపెనింగ్స్ కి షారుఖ్ ఎంత కారణమో, దీపికా పడుకోణె కూడా అంతే కారణం. మరి చాలా గ్యాప్ తర్వాత పఠాన్ సినిమాతో హాట్ హాట్ గా వస్తోన్న దీపికా పడుకోణె మళ్ళీ విజయాల బాట పడుతుందా ?, లేదా ? అన్నది చూడాలి.

ఇవి కూడా చదవండి…

రవితేజ నుండి మరో రెండు సినిమాలు

ప్రభాస్ తో హృతిక్ ?

రైటర్ పద్మభూషణ్‌ హిలేరియస్: షణ్ముఖ

- Advertisement -