- Advertisement -
బిహార్‌లోని వైశాలి జిల్లాలో సీమాంచల్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటన బిహార్‌లో హజీపూర్ వద్ద చోటుచేసుకుంది. తొమ్మిది బోగీలు పట్టాలు తప్పడంతో 7మంది మృతిచెందారు. మరికొంత మందికి గాయాలయ్యాయి. ఎస్8, ఎస్9, ఎస్10, బీ3(ఏసీ), ఒక జనరల్ బోగీ సహా మొత్తం తొమ్మిది బోగీలు పట్టాలు తప్పాయి.
ఈ రోజు(ఆదివారం) తెల్లవారుజామున 3.52 సమయానికి బీహార్ రాజధాని పాట్నాకు 30 కిలోమీటర్ల దూరంలో సహదాయ్ బుజుర్గ్‌లో ఈ ప్రమాదం జరిగినట్లు రైల్వే అధికారులు తెలిపారు. రైలు ప్రమాద ఘటనపై సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సహాయ చర్యలను వెంటనే ప్రారంభించాలని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ఆదేశించారు. బాధితుల సహాయార్థం రైల్వే శాఖ హెల్ప్‌లైన్లను ఏర్పాటు చేసింది. హెల్ప్‌లైన్ నంబర్లు.. సోన్సూర్ – 06158 221645, హజీపూర్ – 06224 272230, బరౌని- 06279 232222.
- Advertisement -