పిల్లలు తప్పు చేస్తే దండించాల్సిన ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులే ఓ బాలిక పాలిట రాక్షసుల్లా తయారయ్యారు. పిల్లలతో కలిసి, పిన్సిపాల్, ఉపాధ్యాయులు మొత్తం 18 మంది 9వ తరగతి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. సభ్య సమాజం తలదించుకునే ఈ ఘటన బీహార్ రాష్ట్రంలో జరిగింది.
ప్రిన్సిపాల్, ఇద్దరు ఉపాధ్యాయులు, 15 మంది విద్యార్ధుతులు కలిసి తనపై గత ఏడు నెలలుగా అత్యాచారం చేస్తున్నారని ఓ విద్యార్థిని ఏక్మా పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసింది. తన తండ్రి జైలుకి వెళ్లినప్పటి నుంచి తనను బెదిరిస్తూ ఈ అఘాయిత్యానికి పాల్పడుతున్నారని చెప్పింది. మొదట తన తోటి విద్యార్థి తనను బెదిరించి అత్యాచారం చేశాడని, తరువాత మరింత మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులతో సహా, ప్రిన్స్ పాల్ కూడా తనపై అత్యాచారం చేశారని ఫిర్యాదులు పేర్కొంది.
తన తండ్రి జైలులో ఉన్న ఏడు నెలలు తనను హింసించారని చెప్పింది. తన తండ్రి తిరిగి రాగానే వారి ఆటలు కొనసాగలేదని ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ప్రిన్సిపాల్, ఇద్దరు ఉపాధ్యాయులను అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షల నిమిత్తం బాలికను ఆస్పత్రికి తరలించారు.