బీహార్ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్…నవంబర్ 10న కౌంటింగ్

266
bihar elections
- Advertisement -

బీహార్ ఎన్నికల షెడ్యూల్ రిలీజైంది. మూడు దశల్లో బీహార్ ఎన్నికలు జరగనున్నాయని సీఈసీ సునీల్ అరోరా తెలిపారు. మొత్తం 243 స్దానాలకు గానూ తొలి దశంలో 71 అసెంబ్లీ స్ధానాలకు, రెండవ దశలో 94 స్థానాలకు,మూడవ దశలో 78 స్ధానాలకు ఎన్నికలు జరగనున్నాయని వెల్లడించారు.

అక్టోబ‌ర్ 28వ తేదీన తొలి ద‌శ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. న‌వంబ‌ర్ 3వ తేదీన రెండ‌వ ద‌శ‌, న‌వంబ‌ర్ 7వ తేదీన మూడ‌వ ద‌శ‌లో ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించ‌నున్నారు. ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపు న‌వంబ‌ర్ 10వ తేదీన ఉంటుంద‌ని సునిల్ ఆరోరా తెలిపారు.

ఉద‌యం 7 నుంచి సాయంత్రం 6 గంట‌ల వరకు పోలింగ్ జరగనుండగా క‌రోనా నేప‌థ్యంలో త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ ఎన్నిక‌లను నిర్వ‌హించ‌నున్న‌ట్లు సునీల్ అరోరా తెలిపారు. ఎన్నిక‌ల వేళ 7 ల‌క్ష‌ల శానిటైజ‌ర్లు, 46 ల‌క్ష‌ల మాస్క్‌లు, 6 ల‌క్ష‌ల పీపీఈ కిట్లు, 7.6 ల‌క్ష‌ల ఫేస్ షీల్డ్‌లు, 23 ల‌క్ష‌ల హ్యాండ్ గ్లౌజ్‌లు వాడ‌నున్నారు. ప్ర‌చారం కోసం కూడా కొత్త నియ‌మావ‌ళిని ప్ర‌క‌టించారు.

- Advertisement -