పోర్న్‌ సైట్స్‌ని బ్యాన్‌చేయండి: మోడీకి నితీశ్ లేఖ

423
modi nithish
- Advertisement -

ప్రధానమంత్రి నరేంద్రమోడీకి లేఖ రాశారు బిహార్ సీఎం నితీశ్ కుమార్‌. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు,లైంగిక వేధింపులను అరికట్టాలని…ఇందుకోసం పోర్న్ సైట్స్‌ని బ్యాన్ చేసి,కఠిన చట్టాలను తీసుకురావాలని కోరారు.

వివిధ రాష్ట్రాలలో జరుగుతున్న అత్యాచారాల కేసులను పరిశీలిస్తే పోర్న్ సైట్స్‌ వల్లే చాలామంది నేర ప్రవృత్తి వైపు అడుగులు వేస్తున్నారని చెప్పారు. ఇంటర్నెట్‌లో పోర్న్ సైట్స్‌పై నిషేధం విధించడం ద్వారా నేరాలను తగ్గించడం సులువవుతుందన్నారు.

బిహార్‌లో ఆడవారిపై జరుగుతున్న లైంగిక దాడులపై ప్రతిపక్షాలు నితీష్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో ప్రధానికి బిహార్ సీఎం లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

- Advertisement -