‘బిగ్ బాస్’ సీజన్ 3 చివరి దశకు చేరుకుంది. ఒక్క వారం మాత్రమే మిగిలి ఉంది. ప్రస్తుతం హౌస్‌లో ఉన్న ఐదుగురు కంటెస్టెంట్లు.. శ్రీముఖి, వరుణ్ సందేశ్, అలీ, రాహుల్, బాబా భాస్కర్‌లలో విజేత ఎవరో ఆదివారం తెలిసిపోనుంది. ఈ ఐదుగురిలో రూ.50 లక్షలు సొంతం చేసుకోబోయేది ఎవరు అనే విషయంలో ‘బిగ్ బాస్’ షో అభిమానులకు విపరీతమైన ఎగ్జయిట్‌మెంట్ ఉంది. అయితే, విజేతగా నిలిచేది శ్రీముఖినే అంటూ గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. దీనికి తగ్గట్టుగానే శ్రీముఖి టీం కూడా ప్రచారం చేస్తోంది.
అయితే టైటిల్ విన్నర్ కూడా శ్రీముఖే గెలిచే చాన్స్ ఉందని తేలడంతో ఒక్కసారిగా నెటిజన్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా శ్రీముఖి గెలిచిన కొన్ని టాస్కులు ప్రత్యేకంగా ఆమె కోసమే డిజైన్ చేశారా అన్నట్లు ఉన్నాయని సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నారు. గతంలో హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన హిమజ సైతం ఇలాంటి ఆరోపణలే చేసింది. అంతేకాదు మహేష్ విట్టా సైతం ఈ రకమైన విమర్శలే చేశాడు. ఎవరైనా దెబ్బ తగలించుకోగానే ఆమె పరిగెత్తుకుంటూ వచ్చి అందరికన్నా ముందుగా రెస్పాండ్ అవుతుందని, ఆమె ఓవర్ యాక్షన్‌కు నిదర్శనమని అన్నాడు.
అంతేకాదు శ్రీముఖిని విన్నర్‌ను చేసేందుకే ఆమెకు టఫ్ కాంపిటీషన్ ఇస్తున్న హిమజ లాంటి వాళ్లను ఎలిమినేట్ చేశారని, ట్విట్టర్ వేదికగా ఆమె ఫ్యాన్స్ మండి పడుతున్నారు. అయితే అటు శ్రీముఖ ఫ్యాన్స్ సైతం ఇదంతా కావాలని చేస్తున్న దుష్ప్రచారం అని, శ్రీముఖి చాలా జెన్యూన్ గా ఆడుతోందని వారు వాదిస్తున్నారు.