Bigg Boss Wild card Entries: ​8 మంది వైల్డ్ కార్డు ఎంట్రీ

3
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు 8 విజయవంతంగా 5 వారాలు పూర్తి చేసుకుంది. ఈ వారం సర్‌ప్రైజ్‌గా 8 మంది వైల్డ్ కార్డులు హౌస్‌లోకి ఇచ్చారు. బిగ్‌బాస్ సీజన్ 1 నుంచి సీజన్ 7 వరకూ ఉన్న సెలబ్రెటీల్లో ఒక్కొక్కరిగా 8 మందిని హౌస్‌ లోపలికి పంపారు.

వైల్డ్ కార్డ్ ఎంట్రీల్లో భాగంగా ముందుగా వచ్చిన కంటెస్టెంట్ హరితేజ. బిగ్‌బాస్ సీజన్ 1లో సందడి చేసిన ఈ బ్యూటీ దాదాపు 8 ఏళ్ల తర్వాత మరోసారి బిగ్‌బాస్‌లోకి అడుగుపెట్టింది. తర్వాత టేస్టీ తేజ ఎంట్రీ ఇచ్చారు. బిగ్ బాస్ 7లో అలరించిన తేజ..ఈసారి అమ్మకిచ్చిన మాట కోసం కప్పు తీసుకునే వెళ్తా అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ మూడో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది నయని పావని. నయని కోసం శివాజీ విషెస్ చెబుతూ ఓ వీడియో చేశాడు. దాన్ని స్టేజ్ మీద ప్లే చేశారు నాగార్జున. నయని.. ఒక విషయం గుర్తుపెట్టుకో గేమ్‌లో గెలవడం ముఖ్యమే కానీ నువ్వు ఎలా గెలుస్తున్నావన్నది మరీ ముఖ్యం. ఎప్పుడూ ఫెయిర్‌గా ఆడు.. నువ్వు నిజాయితీగా ఆడితే విన్ అయినదానికన్నా ఎక్కువగా జనాలకి గుర్తుంటావ్.. నువ్వు గెలవాలి అంటూ విషెస్ చెప్పాడు శివాజీ. తర్వాత మెహబూబ్ ఎంట్రీ ఇచ్చాడు. బిగ్‌బాస్ సీజన్ 4లో అదరగొట్టాడు మెహబూబ్. తన ఫ్రెండ్ కోసం కంటెస్టెంట్ సోహెల్ ఓ వీడియో చేశాడు. సీజన్ 4లో ఆడినట్లే ఆడాలి.. ఈసారి మాత్రం కప్పు మిస్ అవ్వొద్దు అంటూ సోహెల్ కోరాడు.

Also Read:ఆ సమస్య ఉంటే..బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలే!

- Advertisement -