బిగ్ బాస్ 3 ప్రారంభం…కంటెస్టెంట్ల వివరాలు ఇవే

729
Bigboss3 Telugu
- Advertisement -

ఎన్నో వివాదాల మధ్య ఎట్టకేలకు బిగ్ బాస్ 3 ప్రారంభమైంది. ఈసారి నాగార్జున వ్యాఖ్యతగా వ్యవహరించనుండగా బిగ్ బాస్ హౌజ్ 15మంది కంటెస్టెంట్ లను ఎంపిక చేశారు. గత రెండు సీజన్లను మించి ఈ మూడో సీజన్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు కింగ్‌ నాగార్జున ఈసారి రంగంలోకి దిగారు.

ఇక ప్రారంభంతోనే కింగ్ నాగార్జున్ ఎంట్రీ అదిరిపోయింది. బిగ్ బాస్ హౌస్ విశేషాలను ప్రేక్షకులకు నాగార్జున పరిచయం చేస్తుండగా బిగ్‌బాస్‌ ఆదేశాల మేరకు కన్ఫెషన్‌ రూమ్‌లోకి వెళ్లాడు నాగ్‌. అక్కడికి వెళ్లిన నాగ్‌కు బిగ్‌బాస్‌ టాస్క్‌ ఇచ్చాడు. కంటెస్టెంట్లలో ఉన్న ముగ్గురుని నాగ్‌ సెలెక్ట్‌ చేసి వెల్‌కమ్‌ చెప్పాల్సిందిగా టాస్క్‌ ఇచ్చాడు. లక్కీ డిప్‌ ద్వారా వచ్చిన ఎల్లో కార్డ్‌తో..మొదటి కంటెస్టెంట్‌గా తీన్మార్‌ సావిత్రి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళారు. ఇక ఈసీజన్ లో బిగ్ బాస్ హౌజ్ లోకి వచ్చిన కంటెస్టెంట్ వివరాలు చూద్దాం.

1. తీన్మార్ సావిత్రి(శివ జ్యోతి)
2.రవి క్రిష్ణా (సీరియల్ యాక్టర్)
3.డబ్ స్మాష్ అషు రెడ్డి
4.జాఫర్ టీవీ9
5.టీవీ నటి హిమజ
6.సింగర్ రాహుల్ సిప్లింగంజ్
7.సిరియల్ యాక్టర్ రోహిణి
8.కోరియోగ్రాఫర్ బాబా భాస్కర్ మాస్టర్
9.పునర్ణవి భూపాలం
10.సీనియర్ యాక్టర్ హేమ
11.సిరియల్ యాక్టర్ అలీ రెజా
12.యూట్యూబ్ స్టార్ మహేశ్ విట్టా
13.యాంకర్ శ్రీముఖి
14.హీరో వరుణ్ సందేశ్
15.వితికశేరు

- Advertisement -