బిగ్‌బాస్‌ నుండి రోహిణి ఎలిమినేట్‌..

289
Rohoni
- Advertisement -

కింగ్‌ నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న తెలుగు రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌ సీజన్‌3’ నుంచి బుల్లితెర నటి రోహిణి ఎలిమినేట్‌ అయ్యారు. ఈ వారం శివజ్యోతి, వరుణ్‌ సందేశ్‌, బాబా భాస్కర్‌, శ్రీముఖి, రవికృష్ణ, రాహుల్‌, రోహిణి ఎలిమినేషన్‌ నామినేషన్స్‌లో ఉండగా.. రోహిణి ఎలిమినేట్‌ అయినట్లు నాగార్జున తెలిపారు.

Rohoni

ఇక రోహిణి ఎలిమినేట్ అయినట్టు ప్రకటించగానే శివజ్యోతి తట్టుకోలేకపోయింది. వెక్కివెక్కి ఏడ్చేసింది. రోహిణి ఎలిమినేషన్‌కు తానే కారణమన్న బాధతో బోరున విలపించింది. నామినేషన్ సమయంలో కన్‌ఫెషన్ రూం నుంచి బయటకు వచ్చాక ఇతర సభ్యులతో సైగల ద్వారా ఎవరు నామినేట్ అయింది చెప్పడాన్ని చూసిన బిగ్‌బాస్.. శివజ్యోతి, రోహిణిలు ఇద్దరినీ ఎలిమినేషన్‌కు నామినేట్ చేశాడు.

అయితే, ప్రేక్షకుల ఓట్లతో శివజ్యోతి బయటపడగా, రోహిణి షో నుంచి ఎలిమినేట్ అయింది. తనవల్లే రోహిణి నామినేట్ అయిందంటూ పశ్చాత్తాపంతో శివజ్యోతి ఏడ్చేసింది. తన చెంపపై కొట్టుకుంటూ కన్నీరు పెట్టుకుంది. రోహిణి కూడా భావోద్వేగానికి గురైంది. ఏడుస్తూనే హౌస్‌ నుండి వెళ్లిపోయింది.

- Advertisement -