Bigg Boss Telugu 8 Day 3: నామినేషన్స్‌లో ఆరుగురు.ఏడ్చేసిన మణికంఠ

6
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 8 తెలుగు విజయవంతంగా ఫస్ట్ వీక్ ముగియడానికి వస్తోంది. తొలి వారం నామినేషన్ ప్రక్రియ ముగియగా బెజవాడ బేబక్క, సోనియా ఆకుల, పృథ్వీరాజ్, నాగ మణికంఠ, శేఖర్ బాషా, యాంకర్ విష్ణుప్రియ ఎలిమనేషన్‌లో ఉన్నారు. ప్రేక్షకుల నుండి వచ్చే ఓటింగ్‌ను బట్టి ఇందులో ఒకరు ఫస్ట్ వీక్ ఎలిమినేట్ కానున్నారు.

తొలుత బుధవారం నామినేషన్ల ప్రక్రియను హీరో ఆదిత్య ఓం ప్రారంభించాడు. పృథ్వీరాజ్‌ను నామినేట్ చేశాడు. క్లీనింగ్ డిపార్ట్‌మెంట్‌లో అతి తక్కువ పని చేసినవాళ్లలో మీరే. అందరికంటే లీస్ట్‌గా వర్క్ చేశారు అని తన రీజన్ చెప్పాడు. దీనికి పృథ్వీ కూడా ఓకే చెప్పాడు. ఆ తర్వాత లేడిస్‌తో మాట్లాడేటప్పుడు మర్యాదగా ఉండాలి… అఫ్‌కోర్స్, మీరు సారీ చెప్పి కాళ్లు మొక్కారు అని తెలిపాడు. తర్వాత శేఖర్ బాషాను నామినేట్ చేశాడు ఆదిత్య ఓం. మీతో నాకు మంచి ర్యాపో ఏర్పడింది కానీ ఈ నామినేషన్ ప్రక్రియ అంటే ఒక విషం అని చెప్పాడు.

అయితే ఈ సందర్భంగా ఆదిత్య చెప్పిన రీజన్‌కు ఒప్పుకోలేదు శేఖర్ బాషా. లేజీనెస్ అనేది కరెక్ట్ కాదు. నిద్రలేకపోవడం వల్ల అనుకుంటా టైడ్ అయిపోయాను. ఇక వాలంటీర్‌గా హెల్ప్ అంటే వాళ్లకు వీళ్లకు చేస్తూనే ఉన్నాను అని చెప్పాడు.

నామినేషన్ ప్రక్రియ అనంతరం ఏడ్చేశారు మణికంఠ. తాను ఎలిమినేట్ అవుతానని భయం వేస్తోందని, గేమ్ ఎలా ఆడాలో అర్థం కావడం లేదన్నారు. జీవితంలో ఇది తన చివరి యుద్ధమని కన్నీళ్లు పెట్టుకున్నారు. బోరున ఏడ్చేస్తున్న మణికంఠతో బిగ్‍బాస్ మాట్లాడారు. తాను జీవితంలో నిలదొక్కుకోవాలని ఎన్నో ఆశలతో బిగ్‍బాస్‍లోకి అడుగుపెట్టానని.. ఇప్పుడు తన ఆత్మవిశ్వాసం చచ్చిపోయిందని మొరపెట్టుకున్నారు. మొత్తంగా ఫస్ట్ వీక్ నామినేషన్ తో హౌస్‌లో గొడవలు ప్రారంభం అయ్యాయి.

Also Reda:లక్ష చెట్లు కూలిపోవడం బాధాకరం: సంతోష్ కుమార్

- Advertisement -