బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 విజయవంతంగా 68 రోజులు పూర్తిచేసుకుంది. తాజా ఎపిసోడ్‌లో భాగంగా ఈ వారం కెప్టెన్‌గా నిలిచింది ఫైమా. కెప్టెన్సీ పోటీలో శ్రీసత్య, ఆదిరెడ్డి, ఫైమా మిగలగా థర్మోకోల్స్ బాల్స్ గేమ్ లో చివరికి ఫైమా గెలిచి ఈ వారం కెప్టెన్ గా ఎన్నికైంది.
ఈ టాస్క్ లో భాగంగా ఫైమా, ఆదిరెడ్డి కలిసి ఆడారని ఇనయా గొడవకు దిగింది. ఈ క్రమంలో ఇనయ- ఆదిరెడ్డి మధ్య మాటల యుద్దం జరుగగా రేవంత్, రాజ్ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ శ్రీహాన్, శ్రీసత్య గురించి తప్పుగా మాట్లాడటంతో శ్రీహాన్ రెచ్చిపోయి రేవంత్ తో గొడవ పెట్టుకున్నాడు.
వరస్ట్ పర్ఫార్మర్స్ కి రెడ్ స్టాంప్స్ వేయగా వరస్ట్ పర్ఫార్మర్ ఎంపికలో కంటెస్టెంట్స్ మధ్య గొడవలు అయ్యాయి. ఎక్కువమంది ఇనయాకి రెడ్ స్టాంప్ ఇవ్వగా ఇనయా అందరితో గొడవ పెట్టుకుంది. తర్వాత ఎక్కువ ఓట్లు రావడంతో ఇనయ జైలుకు వెళ్లింది.
ఇవి కూడా చదవండి…