టికెట్‌ టు ఫినాలే..రేవంత్ వర్సెస్ శ్రీహాన్

477
revanth
- Advertisement -

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 విజయవంతంగా 90 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. తాజా ఎపిసోడ్‌లో భాగంగా శ్రీహాన్, రేవంత్‌లు టాప్ 2గా నిలిచారు. చివరి దశలో రేవంత్, ఆదిరెడ్డి, శ్రీహాన్‌లు ముగ్గురూ పోటీపడ్డారు. ఈ టాస్క్‌ ముందు వరకు ఆదిరెడ్డి.. అందరి కంటే ఎక్కువ పాయింట్లతో తొలి స్థానంలో ఉండగా.. ఈ టాస్క్ తరువాత మూడో స్థానానికి పడిపోయాడు.

తర్వాత ఈ ముగ్గురికీ పరుగుపెడుతూ బెలూన్లు ఊదే టాస్క్ ఇచ్చారు. గాలి ఊది బెలూన్లు పగలగొట్టాలన్నమాట. ఈ టాస్క్‌ని అందరికంటే ముందు రేవంత్ కంప్లీట్ చేయగా.. ఆ తరువాత శ్రీహాన్ కంప్లీట్ చేశారు. ఆదిరెడ్డికి బెలూన్‌లు ఊదడం చేతకాకపోవడంతో.. ఈ టాస్క్‌లో ఓడిపోయాడు.

తాను ఓడిపోవడంతో ఆదిరెడ్డి తెగ ఫీల్ అయ్యారు. టై అయినప్పుడు.. వేరే టాస్క్ ఇవ్వాలి కదా బిగ్ బాస్.. నేను ఓడిపోయిన టాస్క్‌నే మీరు ఎలా ఇస్తారు అని ప్రశ్నించాడు. తర్వాత రోహిత్-ఇనయల మధ్య హీట్ డిస్కషన్ నడిచింది. ఎవరి వాదన వాళ్లు వినిపించారు. తర్వాత ముగ్గుర్ని చివరి దశకు ఎంపిక చేయాలని బిగ్ బాస్ చెప్పారు. దీంతో ఈ ముగ్గురు ఆలోచించి.. చివరి మూడు స్థానాల్లో ఉన్న రోహిత్, ఫైమా, రేవంత్‌లకు అవకాశం ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు.

ఈ ప్రాసెస్‌లో ఇనయ, రోహిత్‌ల మధ్య పెద్ద గొడవే అయ్యింది. దీంతో ఇనయ.. చేసేది లేక.. టాప్‌లో ఉన్న ఆదిరెడ్డి, శ్రీహాన్, రేవంత్‌లను నెక్స్ట్ లెవల్‌కి ఏకాభిప్రాయంతో ప్రమోట్ చేసింది. ఫైమాని పక్కకి తప్పించడంతో ఆమె ఎమోషనల్ అయ్యి ఏడ్చింది. మొత్తంగా టికెట్ టు ఫినాలే టాస్క్‌లో రేవంత్ వర్సెస్ శ్రీహాన్‌లు మిగిలగా వీళ్లిద్దరిలో ఒకరికి టికెట్ టు ఫినాలే దక్కబోతుంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -