BB6..ఈవారం అంతా ఎమోషనే!

147
- Advertisement -

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 విజయవంతంగా 83 రోజులు పూర్తి చేసుకుంది. ఇక ఈ వారం అంతా ఎమోషన్స్‌ తో సాగింది. హౌస్‌లో ఉన్న వారి కుటుంబ సభ్యులు,వారి జ్ఞాపకాలను గుర్తుచేసుకుని బాధపడిపోయారు ఇంటి సభ్యులు. ఇక తాజా ఎపిసోడ్‌లో భాగంగా హౌస్‌ మేట్స్ బెస్ట్ ఫ్రెండ్స్‌ని పిలిచి మరింత ఎంటర్‌టైన్ చేశారు బిగ్ బాస్.

తొలుత ఇనయా కోసం ఆమె తమ్ముడు, మాజీ కంటెస్టెంట్ సోహైల్‌ వచ్చారు. ఇనయా తమ్ముడు.. ఇనయను, ఆమె తల్లిని కలిపినందుకు బిగ్ బాస్ కు కృతజ్ఞతలు తెలిపాడు. ఇక సోహైల్ ఫినాలేలో డబ్బు ఆఫర్‌ చేస్తే తనలా సూట్‌కేస్‌ తీసుకోమని వచ్చేయమని సలహా ఇచ్చాడు. శ్రీహాన్‌ కోసం అతడి తండ్రి, శివబాలాజీ వచ్చారు. ఫైమా కోసం తన అక్క సల్మా, అలాగే బుల్లెట్‌ భాస్కర్‌ వచ్చారు. అక్కని చూడగానే ఫైమా ఏడ్చేసింది. పెళ్లి గురించి టాపిక్ రాగా ఫైమా మాట్లాడుతూ.. అమ్మ వాళ్లకు సొంతిల్లు కట్టించి, బ్యాంక్‌ బ్యాలెన్స్‌ ఇచ్చాకే తాను పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది.

రేవంత్‌ కోసం వాళ్ళ అన్నయ్య సంతోష్‌, స్నేహితుడు రోల్‌ రైడా వచ్చారు. తన తమ్ముడికి శ్రీహాన్‌ పోటీ అని, రోహిత్‌ అసలు పోటీనే కాదని సంతోష్ చెప్పాడు. రోహిత్‌ కోసం అతడి తమ్ముడు డింప్‌, నటుడు ప్రభాకర్‌ వచ్చారు. ఆదిరెడ్డి కోసం చెల్లెలు నాగలక్ష్మి, మాజీ కంటెస్టెంట్‌ లహరి వచ్చారు. నాగలక్ష్మి అంధురాలు కావడంతో నిన్ను చూడలేకపోతున్నా అంటూ ఎమోషనల్ అయింది.

ఇక శ్రీసత్య కోసం తన బెస్ట్‌ఫ్రెండ్‌ హారిక, నటి విష్ణుప్రియ వచ్చారు.రాజ్‌ కోసం అతని ఫ్రెండ్‌ వెంకీ, హీరో సాయిరోనక్‌ వచ్చి మాట్లాడారు. రాజ్‌కు ఆటలో రేవంత్‌ కాంపిటీషన్‌ అని, ఇనయా పోటీనే కాదని చెప్పారు.కీర్తి కోసం ప్రియాంక, వితికా షేరు వచ్చారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -