BB6.. డేంజర్ జోన్‌లో ఎంతమందో తెలుసా?

125
bigg boss telugu 6
- Advertisement -

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 విజయవంతంగా 57 రోజులు పూర్తి చేసుకుంది. తాజా వారంలో భాగంగా నామినేషన్స్ ప్రక్రియ హాట్ హాట్‌గా సాగింది. హౌస్‌లో 13 మంది ఉండగా 10 మంది ఎలిమినేషన్‌కు నామినేట్ అయ్యారు.

ఈవారం నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఎవరినైతే నామినేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ దిష్టిబొమ్మలపై కుండ పెట్టి రీజన్ చెప్పి ఆ కుండని పగలకొట్టి నామినేట్ చేయాలని సూచించారు బిగ్ బాస్. తొలుత గీతూతో నామినేషన్ ప్రక్రియ మొదలుకాగా రోహిత్, మెరీనాలను నామినేట్ చేసింది. ఇక తర్వాత రేవంత్… కీర్తి, ఇనయాలను నామినేట్ చేశారు.

ఆదిరెడ్డి… ఇనయా, రేవంత్ లను నామినేట్ చేశాడు. మెరీనా… శ్రీసత్య, గీతూలని,బాలాదిత్య.. శ్రీసత్య, ఫైమాలని ,కీర్తి… గీతూ, రేవంత్ లని, రోహిత్… గీతూ, శ్రీసత్యలని, వాసంతి… గీతూ, రేవంత్ లని, రాజ్. .. గీతూ, బాలాదిత్యలని, ఫైమా… బాలాదిత్య, ఇనయాలని , శ్రీసత్య.. బాలాదిత్య, ఇనయాలని, ఇనయ… గీతూ, ఆదిరెడ్డి లని, శ్రీహన్… కీర్తి, ఇనయాలను నామినేట్ చేశారు.

మొత్తానికి హౌస్‌లో 13 మంది ఉండగా 10 మంది ఈ వారం నామినేట్ అయ్యారు. రాజ్, వాసంతి, శ్రీహన్ లకి ఒక్క ఓటు కూడా పడకపోవడంతో ఈ వారం నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యారు.

ఇవి కూడా చదవండి..

నిరాడంబరుడు…గుమ్మడి

గీతాగోవిందం దర్శకుడితో బాలయ్య!

మునుగోడు.. మునిగేది ఎవరో?

- Advertisement -