బిగ్ బాస్ సీజన్-5 బిగ్‌ అప్‌డేట్‌..

156
big boss
- Advertisement -

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే నాలుగు సీజన్స్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఇప్పుడు 5వ సీజన్‌‌‌కు సిద్ధం అవుతోంది. తెలుగులో బిగ్ బాస్ సీజన్-5 మరోసారి సందడి చేయనుంది. అయితే తాజాగా బిగ్ బాస్ 5 సీజన్ ప్రారంభంపై ఆప్‌డేట్‌ ఇచ్చారు నిర్వాహకులు. హోస్ట్‌ నాగార్జునతో ఓ ప్రకటన విడుదల చేశారు. బోర్ కొడుతోందన్న మాటే ఇక వినిపించదని, పక్కా ఎంటర్టయిన్ మెంట్ అందించేందుకు బిగ్ బాస్-5 వచ్చేస్తోందని నాగ్ తెలిపారు. విసుగు నుంచి విముక్తి అని పేర్కొన్నారు. ఈ మేరకు బిగ్ బాస్ నిర్వాహకులు ఓ సరదా వీడియో రూపొందించారు.

- Advertisement -