బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 9 తెలుగు విజయవంతంగా 49 రోజులు పూర్తి చేసుకుంది. తాజా వారంలో భాగంగా ఇంటి నుండి ఎలిమినేట్ అయ్యారు రమ్య. ఎలిమినేషన్లో భాగంగా చివరికి రమ్య-సంజన మిగలగా మీ ఇద్దరి పైనా క్లౌడ్స్ ఆర్ వెయిటింగ్.. ఎవరి మేఘం నుంచి అయితే వర్షం పడుతుందో వాళ్లు సేఫ్.. ఎవరి మేఘం అయితే వర్షించదో వాళ్లు ఎలిమినేటెడ్.. నేను వారి కోసం స్టేజ్ మీద వెయిట్ చేస్తూ ఉంటాను అని నాగ్ అన్నారు.
ఇమ్మానుయేల్ నీ దగ్గర పవరాస్త్ర ఉంది.. దానికి సేవింగ్ పవర్ కేవలం లాస్ట్ వీక్ మాత్రమే ఉంది.. ఆ పవర్ నీకు లేదు ఇక.. నీ క్లారిటీ కోసం ఆడియన్స్ క్లారిటీ కోసం మళ్లీ ఈ విషయం నీకు చెప్తున్నాను అని నాగ్ తెలిపారు.
ఇక సంజన తల మీద ఉన్న మేఘం నుంచి వర్షం కురిసింది. దీంతో రమ్య యూఆర్ ఎలిమినేటెడ్.. సంజన నువ్వు సేఫ్ అని నాగ్ ప్రకటించారు. బయటకు వెళ్తున్న రమ్యను గట్టిగా పట్టుకొని ముద్దు పెట్టింది మాధురి. ఏడవద్దు మీరు ఏడిస్తే నాకు ఏడుపొస్తుంది.. నేను నవ్వుతూ వెళ్లాలి.. నువ్వు ఫస్ట్ ఏం చెప్పావో అలాగే చెయ్ సరేనా.. బై లవ్యూ.. బయటికొచ్చాక కలుద్దాం సరేనా జాగ్రత్తా.. ఎక్కువ అరవకు అంటూ మాధురికి సలహాలు ఇచ్చింది రమ్య.
స్టేజ్ మీదకి రాగానే ఎలా ఉన్నావ్ రమ్య.. డిజప్పాయింట్ అయ్యావా.. అని నాగార్జున పలకరించారు. లేదు సార్ నేను ఫిక్స్ అయ్యే వచ్చాను ప్రతి వారం నామినేషన్స్‌లో ఉంటానని.. కానీ ఇంత త్వరగా వెళ్తానని అనుకోలేదు.. నాకు దేనికైనా హ్యాపీ సార్ అని చెప్పింది.
Also Read:హైదరాబాద్‌లో #VT15

