బిగ్ బాస్ ఓటీటీ…కంటెస్టెంట్స్‌ వీరే!

205
bb ott
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు విజయవంతంగా 5 ఎపిసోడ్స్ పూర్తిచేసుకుంది. ఇక 6వ సీజన్‌ ప్రారంభానికి మరికొంత సమయం ఉండగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చారు నిర్వాహకులు. ఫిబ్రవరి 21 నుండి బిగ్ బాస్ తెలుగు ఓటీటీ ఫస్ట్ సీజన్ ప్రసారం కానుంది. డిస్నీ+ హాట్‌స్టార్ 24*7 షోను ప్రసారం చేస్తుండగా ఈ ఫార్మాట్‌లో కూడా నాగ్ హోస్ట్‌గా వ్యవహరించనున్నాడు. దీనికి సంబంధించిన అన్ని పనులు శరవేగంగా జరుగుతున్నాయని, గ్రాండ్ లాంచ్ కోసం టీమ్ సన్నద్ధమవుతోంది.

ఓటీటీ వెర్షన్ కూడా 12 వారాల పాటు ప్రసారం కానుండగా ఇందులో పాల్గొనే కంటెస్టెంట్స్ పై రోజుకో వార్త టీటౌన్‌లో చక్కర్లు కొడుతోంది. వైష్ణవి చైతన్య, మౌనిక రెడ్డి, నిఖిల్, ముమైత్ ఖాన్, తేజస్వి మదివాడ, హీరో ప్రిన్స్ తదితరుల పేర్లు ప్రచారం జరుగుతోంది.

ఈ కొత్త షో కోసం ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోస్‌లో సెట్‌ను ఏర్పాటు చేయగా, ఈ కార్యక్రమాన్ని మరింత ఆసక్తికరంగా మార్చడానికి బిగ్ బాస్ బృందం సన్నాహాలు చేస్తోంది.

- Advertisement -