నాన్ స్టాప్ ‘బిగ్ బాస్’ షురూ..

149
- Advertisement -

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ వేదికగా బిగ్ బాస్ రియాలిటీ షో శనివారం నుండి ప్రారంభమైంది. బిగ్ బాస్ అన్ని సీజన్లు ఓలెక్క ఈ ఓటీటీ మరో లెక్క అన్నట్టుగా హంగామా మామూలుగా లేదు. టీవీ చానళ్లలో ప్రసారమయ్యే బిగ్ బాస్ షోలో ఎడిట్ చేసిన కంటెంట్ ఉంటుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ప్రసారమయ్యే బిగ్ బాస్ షో 24 గంటలు నాన్ స్టాప్‌గా ప్రసారమవుతుంది. ఈ షోకి కూడా నాగార్జునే హోస్ట్. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ యాప్‌లో బిగ్ బాస్ స్ట్రీమింగ్ ప్రారంభమైందని నాగ్ వెల్లడించారు.

కాగా, ఈసారి బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లినవారిలో గతంలో ఈ రియాలిటీ షోలో పాల్గొన్నవారు కూడా ఉన్నారు. అరియానా, ముమైత్ ఖాన్, ఆషూ రెడ్డి, తేజస్విని మదివాడ, మహేశ్ విట్టా, నటరాజ్ మాస్టర్, హమీదా, అఖిల్ సార్దక్, సరయు ఉన్నారు. కొత్తగా బిందు మాధవి, ఆర్జే చైతూ, అజయ్ ఖతుర్వార్, మిత్ర శర్మ, శ్రీ రాపాక, స్రవంతి చొక్కారపు, అనిల్ రాథోడ్, శివ ఉన్నారు.

సోషల్‌ మీడియాలో లీకైన లిస్టే.. బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వడంతో ప్రేక్షకుల్లో అంతగా ఉత్కంఠ కనపడలేదు. బిగ్‌బాస్‌ టీమ్‌ కడవరకు సస్పెన్స్‌ మెయింటెన్‌ చేసినా కూడా లీకులు మాత్రం ఆగలేదు. 84 రోజుల పాటు 17 మందితో సాగే ఈ షో.. నేటి నుంచి కంటెస్టెంట్ల గొడవలు, ప్రేమలు, కోపాలు, అలకలతో రక్తికట్టించబోతోంది.

- Advertisement -