బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 9 తెలుగు విజయవంతంగా 70 రోజులు పూర్తి చేసుకుంది. ఆదివారం ఎపిసోడ్‌కి నాగ చైతన్య గెస్టుగా వచ్చారు. తాను ఈ మధ్య కొనుగోలు చేసిన కొత్త రేసింగ్ టీమ్‌ని కూడా పరిచయం చేశారు. అనంతరం హౌస్‌మేట్స్‌ని ఒక గేమ్ ఆడించారు.
ఈ క్రమంలో డేంజర్ జోన్‌లో ఉన్న ఒక్కొక్కరిని సేవ్ చేస్తూ వచ్చారు. చివరగా దివ్య-గౌరవ్ ఇద్దరినీ ఎలిమినేషన్ రౌండ్ ఆడించారు. ఇందులో దివ్య సేఫ్ అయి గౌరవ్ ఎలిమినేట్ అయ్యాడు. అయితే తనూజ దగ్గరున్న సేవింగ్ పవర్ ఈ వారంతో ఎక్స్‌పెయిర్ అవుతుంది.
దీంతో అది ఉపయోగిస్తావా అంటూ నాగ్ అడిగారు. ఒకవేళ ఉపయోగిస్తే ఓట్ల ద్వారా సేవ్ అయిన దివ్య ఎలిమినేట్ అయి గౌరవ్ సేఫ్ అవుతాడని నాగ్ చెప్పారు. కానీ తనూజ ఆలోచించి ఆడియన్స్ ఓటింగ్‌కి గౌరవం ఇస్తున్నాను వాడటం లేదని చెప్పింది. దీంతో గౌరవ్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయాడు.
Also Read:శబరిమల ఆలయం..సూచనలివే

