BB9 Telugu:ప్రియ ఎలిమినేట్

9
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 9 తెలుగు విజయవంతంగా మూడు వారాలు పూర్తి చేసుకుంది. మూడోవారం ఇంటినుండి ఎలిమినేట్ అయ్యారు ప్రియ. మూడోవారం మొత్తం ఆరుగురు నామినేషన్స్‌లో ఉండగా డేంజర్ జోన్‌లో పవన్ కళ్యాణ్, ప్రియ నిలిచారు.

ఈ ఇద్దరిలో తక్కువ ఓటింగ్ పడటంతో ప్రియ ఎలిమినేట్ అయింది. దసరా కావడంతో సింహం బొమ్మని వీళ్ల మధ్యలో పెట్టి.. ఆ సింహం ఎవరివైపు చూసి గర్జిస్తుందో వాళ్లు సేఫ్.. అవతలి వారు ఎలిమినేట్ అని నాగ్ చెప్పారు. అయితే ఈ ప్రాసెస్ మొదలుకాగానే కళ్యాణ్ ఎమోషనల్ అయిపోయాడు.

చివరికి కళ్యాణ్ వైపు చూసి సింహం గర్జించడంతో ప్రియ ఎలిమినేట్ అంటూ నాగార్జున ప్రకటించారు. తర్వాత స్టేజ్ మీదకు వెళ్లగా హౌస్‌లో ఐదుగురికి డెవిల్ హార్న్స్ (ఎర్ర కొమ్ములు) పెట్టాలని నాగార్జున చెప్పారు.సార్ నిజానికి నేను ఏడవకూడదనుకున్నా కానీ నాకు ఏడుపొస్తుంది.. అందరూ నన్ను బుజ్జగించారు.. నాకు ఒక్కొక్కరితో ఒక్కొక్క బాండ్ ఏర్పడింది అని తెలిపింది ప్రియ.

నాకు ముగ్గురు గురించి చెప్పాలని ఉంది సార్.. కళ్యాణ్, శ్రీజ, డీమాన్.. కళ్యాణ్‌కి 23 ఏళ్లు సార్.. వాడికి ఆ ఏజ్ ఆఫ్ మెచ్యూరిటీ అంత అండర్‌స్టాండింగ్ ఎక్కడి నుంచి వస్తుందో నాకు అర్థం కాదు సార్ అని తెలిపింది. తర్వాత ఫస్ట్ హార్న్.. హరీష్‌కి ఇస్తూ ఎవరైనా మీది తప్పంటే మీరు అసలు వినరండి.. ఫస్ట్ అందరూ చెప్పేది వినండి.. అందరితో కలవండి అనిచెప్పింది. తర్వాత తనూజ పేరు చెప్పింది. తను చాలా మంచిది నాకు ఒక్కటే ఉంది… అలగకు.. దానికి మించి ఏం లేదు.. నీ హగ్స్ మిస్ అవుతా.. అంటూ ప్రియ ఎమోషనల్ అయింది.

తర్వాత బాబాయ్ భరణి.. సిల్లీ రీజన్స్‌కి అందరినీ నామినేట్ చేయకండి బాబాయ్ అని చెప్పింది. వెళ్తూ వెళ్తూ కళ్యాణ్ నువ్వు కూడా డెవిల్ హర్న్ పెట్టుకో.. ఫ్రెండ్స్‌ని చేసుకోవడం తప్పు కాదు వెళ్తూవెళ్తూ ఇమ్మూ మిస్ యూ అంటూ ప్రియ చెప్పింది.

Also Read:నాగార్జున సాగర్..26 క్రస్ట్ గేట్లు ఎత్తివేత

- Advertisement -