బిగ్‌బాస్ ఫ్యామిలీ వీక్‌లో భాగంగా ‘ఒన్స్ మోర్… ఒన్ లాస్ట్ టైమ్’ అంటూ ఈ సీజన్‌లో హిట్ అయిన టాస్కులను మళ్లీ రిపీట్ చేస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన టాస్కుల్లో ఎక్కువ విజయాలు సాధించిన ప్లేయర్ డీమాన్. అందుకే అతడికి ‘ప్లేయర్ ఆఫ్ ది డే’ అవార్డు దక్కింది. అనంతరం జరిగిన టాస్కుల్లో ఒకదాంట్లో కళ్యాణ్–తనూజ విజయం సాధించడంతో హౌస్‌మేట్స్ నిర్ణయంతో తనూజకు ‘ప్లేయర్ ఆఫ్ ది డే’ ఇచ్చారు. ఈ అవార్డ్ గెలిచిన సందర్భంగా తనూజ కోసం బిగ్‌బాస్ ఒక స్పెషల్ ఫోటో కూడా పంపించాడు.
అయితే తనూజ విషయంలో ఆడియన్స్ ఎప్పటినుంచో ఒక కామెంట్ చేస్తూ వస్తున్నారు. “తనూజ నవ్వితే చాలా నేచురల్‌గా ఉంటుంది… కానీ ఏడ్చినప్పుడు మాత్రం యాక్టింగ్‌లా అనిపిస్తుంది” అని. ఫ్యామిలీ వీక్‌లో హరిత, పవన్ సాయి స్టేజ్‌పైకి వచ్చినప్పుడు హరిత ఇచ్చిన స్పీచ్ సమయంలో తనూజ ఎక్స్‌ప్రెషన్స్ సోషల్ మీడియాలో ట్రోల్ మెటీరియల్‌గా మారిన సంగతి తెలిసిందే. అదే సమయంలో కళ్యాణ్ తండ్రి, డీమాన్ ఫాదర్ మాట్లాడిన మాటలు మాత్రం చాలా సహజంగా ఉండటంతో వైరల్ అయ్యాయి. యాక్టింగ్‌కు, సహజ భావోద్వేగానికి మధ్య ఉన్న తేడా ఇదే అని చాలామంది కామెంట్ చేశారు.
ఇప్పుడు అదే తరహా సీన్ మరోసారి హౌస్‌లో రిపీట్ అయింది. ఫినాలే వీక్‌లో రోజూ ఒకరికి ‘ప్లేయర్ ఆఫ్ ది డే’ ప్రకటిస్తూ, గెలిచిన వారికి వారి కుటుంబం నుంచి గిఫ్ట్ లేదా సందేశం చూపిస్తున్నారు. ముందుగా డీమాన్‌కు అతడి అన్నయ్య వీడియో మెసేజ్ చూపించారు. తర్వాత తనూజ టర్న్ వచ్చింది. ఆమెకు చెల్లెలి పెళ్లి ఫోటోలతో కూడిన ఫోటో ఫ్రేమ్ పంపించారు. అందులో తనూజ కుటుంబ సభ్యుల ఫోటోలతో పాటు, తనూజని ఫోటోషాప్ చేసి ఫ్రేమ్‌లో యాడ్ చేశారు.
ఫ్రేమ్ తెచ్చే సమయంలోనే తనూజ కాస్త ఎక్సైట్ అయింది. కానీ ఫోటో చూసిన వెంటనే ఆమె ఒక్కసారిగా ఏడ్చేయడంతో హౌస్‌మేట్స్ కూడా షాక్ అయ్యారు. “నువ్వు లేని ఫోటోనా?” అంటూ సంజన అడిగినా, తనూజ ఏడుపు ఆగలేదు. “డాడీ… ఐయామ్ రియల్లీ సారీ” అంటూ వెక్కివెక్కి ఏడ్చింది. హ్యాపీగా ఫీల్ అవ్వాలి అని సంజన, ఇమ్మూ చెప్పినా, తనూజ భావోద్వేగం మాత్రం ఆడియన్స్‌కు మళ్లీ అదే అనిపించేలా చేసింది.
Also Read:వాట్సాప్ డేటా సేకరణ..అనుమతి తప్పనిసరి!

