BB9:ఆడియన్స్‌పైనే తనూజ భారం

5
- Advertisement -

ఆటలో గెలుపు–ఓటములు సహజమే. కానీ గెలుపు కన్నా ముఖ్యమైనది ఎలా గెలిచాం అన్నదే. కోట్ల మంది ప్రేక్షకులు, వందల కెమెరాల మధ్య దొడ్డిదారిలో గెలవాలని ప్రయత్నిస్తే చివరికి నిజం బయటపడుతుంది. డిసెంబర్ 12 ఎపిసోడ్ ఆరంభంలో హౌస్ అంతా హుషారైన పాటలతో ఊగిపోయింది. కళ్యాణ్, ఇమ్మానుయేల్, సంజనా మాస్ స్టెప్స్‌తో సందడి చేశారు. అయితే గత కొన్ని రోజులుగా ‘తల్లీ–కొడుకులు’గా ఉన్న ఇమ్మూ, సంజన మధ్య దూరం పెరిగింది. గేమ్ తర్వాత మాట్లాడతానంటూ సంజనా భావోద్వేగానికి లోనైంది. “మమ్మీ అని పిలిచిన వాడు ఇప్పుడు సంజనా గారూ అంటున్నాడు… ఇది గేమ్ అయినా బాధగా ఉంది” అంటూ కన్నీళ్లు పెట్టుకుంది.

ఇక ఉదయం నుంచే కళ్యాణ్ తనూజకు ‘కోచింగ్’ ఇవ్వడం ప్రారంభించాడు. భరణి నుంచి పాయింట్లు ఎలా దక్కించుకోవాలన్న దిశగా ఇన్‌డైరెక్ట్ సూచనలు ఇవ్వడం హౌస్‌లో చర్చనీయాంశమైంది. తనూజ మాత్రం “నేను ఎవరితోనూ చెడుగా ఉండలేదు” అంటూ తన ఆటను సమర్థించుకుంది.

ట్విస్ట్ ఏమిటంటే… తనూజ తనకు సపోర్ట్ చేయలేదని అనుకున్న భరణి చివరికి ఆమెకే పాయింట్లు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. భావోద్వేగంగా మారిన ఆ క్షణంలో తనూజ హగ్‌లు, ముద్దు మాటలతో సీన్ మొత్తం తనవైపు తిప్పుకుంది. దీంతో ఆమె 450 పాయింట్లతో లీడ్‌లోకి వచ్చింది.

Also Read:అమేజింగ్‌గా మోగ్లీ కంటెంట్!

అయితే ఇమ్మానుయేల్ వెంటనే కౌంటర్ ఇచ్చాడు. తదుపరి టాస్క్‌లో వీరోచితంగా ఆడి గెలిచి 520 పాయింట్లతో టాప్‌కు చేరాడు. కానీ చివరి టాస్క్‌లో అననుకూల పరిస్థితులు ఇమ్మూకి ఎదురవడంతో తనూజ విజయం సాధించింది.

బిగ్ బాస్ ఇచ్చిన ఇమ్యూనిటీ ఆప్షన్‌ను తిరస్కరించిన తనూజ, “ఆడియన్స్ నిర్ణయానికే నేను సిద్ధం” అంటూ నామినేషన్స్‌కి ఓకే చెప్పింది. ఇది ఆమెకు ప్లస్ అవుతుందా? లేక గేమ్‌లో చేసిన పొరపాట్లకు ప్రేక్షకులే తీర్పు ఇస్తారా? చూడాలి.

- Advertisement -