బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 9 తెలుగు విజయవంతంగా 72 రోజులు పూర్తి చేసుకుంది. సోమవారం నాటి నామినేషన్స్ ఎపిసోడ్‌లో డెమాన్ పవన్.. రీతూ చౌదరి నామినేట్ చేశాడు. అయితే ఆమెని నామినేట్ చేయడానికి అరుస్తుందని సొల్లు రీజన్ చెప్పాడు కానీ ముందురోజు రాత్రి రీతూ, డెమాన్ పవన్‌లు అర్థరాత్రి ఇద్దరూ ఒకే బెడ్ ఎక్కి ఇద్దరూ ఒకే దుప్పట్లోకి దూరేశారు.
డెమాన్ పవన్,రీతూ చౌదరి ఒకే బెడ్‌పై ఒకే బెడ్ షీట్‌లోకి దూరగా.. మధ్యలో కళ్యాణ్ వచ్చాడు. అయితే దానికి ఢమాల్ పవన్ (డెమాన్) తెగ ఫీల్ అయిపోయాడు. పొద్దున్నే రీతూని కూర్చోబెట్టి.. నేను చెప్పింది అర్థం చేసుకో రీతూ. మనం మాట్లాడుకుంటుంటే మధ్యలో వాడు వచ్చాడు. రేయ్ ఉండ్రా అని వాడ్ని ఆపి పంపించేయొచ్చు కదా.. ఏ?? అది లేదా? అని తెగ ఫీల్ అయిపోయాడు.
పవన్.. నీనేం చూడటం లేదు.. అలా ఎవరైనా మన మధ్యలోకి వచ్చినప్పుడు నన్ను వదిలేస్తానంటే నాకు వద్దు అని అన్నాడు. నేను నిన్ను వెళ్లిపోమని చెప్పలేదు.. నేను సీక్రెట్‌గా కళ్యాణ్‌తో మాట్లాడాలనీ అనలేదు. నీకు నువ్వు ఫీల్ అయ్యి.. నీకు నువ్వు డిసైడ్ అయ్యి పక్క బెడ్‌పైకి వెళ్లావ్. వాడికి నిద్ర వస్తుందేమోనని మాట్లాడాను అని క్లియర్‌గా చెప్పింది రీతూ.
Also Read:మక్కా సంఘటన బాధాకరం:మహేష్ కుమార్
అవున్రా బాబూ వాడు జోక్‌గానే అన్నాడు అని రీతూ అంటే.. నేను వాడ్ని అనడం లేదు.. నువ్వు నన్ను రమ్మని ఎందుకు పిలవలేదు అని నిబ్బీ గాడు తెగ ఫీల్ అయిపోయాడు. అసలు వీడి బాధ ఏంటో.. అర్థరాత్రి పూట వీడ్ని ఆడపిల్ల బెడ్‌మీదికి రమ్మని ఎందుకు పిలవాలో.. ఆమె దుప్పట్లోకి వీడెందుకు దూరాలో.. దానికి వీడు ఇంత ఫీల్ అయిపోవడం ఏంటో.. అసలు వీడు బిగ్ బాస్ హౌస్‌లోకి ఎందుకు వచ్చాడో.. సొంత పెళ్లాన్ని కూడా ఎవడూ ఇంతలా ఆర్డర్లు వేయడు.. గొడవలు పడడు. కానీ ఢమాల్ గాడు మాత్రం.. చిన్న దానికి రీతూపై అధికారం చెలాయిస్తూ టార్చర్ చూపించాడు.

