BB9:తనూజతోనే ఉండాలనుంది!

21
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 9 తెలుగు విజయవంతంగా 99 రోజులు పూర్తి చేసుకుంది. బిగ్‌బాస్ చరిత్రలో అరుదైన పరిణామం ఈ సీజన్‌లో కనిపిస్తోంది. సాధారణంగా టైటిల్ రేసులో ఉన్న టాప్–2 మధ్య తీవ్ర పోటీ, వ్యూహాత్మక యుద్ధం, మాటల తూటాలు కనిపిస్తుంటాయి. కానీ ఈసారి మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. టైటిల్ ఫేవరెట్స్‌గా మారిన తనూజ – కళ్యాణ్ మధ్య గట్టి పోటీకి బదులు బలమైన బాండింగ్ కనిపిస్తోంది. ఇద్దరూ మంచి ఫ్రెండ్స్‌గా మారడమే కాకుండా, పరస్పర గౌరవంతో ముందుకెళ్తుండటం హౌస్‌లోనే కాదు, బయట ఫ్యాన్స్‌లోనూ చర్చనీయాంశంగా మారింది.

ఇప్పటివరకు తనూజపై తన ఇష్టం, ప్రేమను కళ్యాణ్ ఓపెన్‌గా వ్యక్తం చేస్తూనే ఉన్నాడు. మాటల్లోనూ, ప్రవర్తనలోనూ అది పలుమార్లు బయటపడింది. అయితే తనూజ మాత్రం ఎప్పుడూ కూల్‌గా స్పందిస్తూ, చిన్న చిరునవ్వుతో లేదా టాపిక్ మార్చేస్తూ వచ్చింది. తాజాగా బిగ్‌బాస్ జర్నీ గురించి మాట్లాడే సమయంలో కళ్యాణ్ మరోసారి తన మనసులోని మాటను చెప్పడం ఆసక్తికరంగా మారింది.

తన జర్నీని వివరిస్తూ కళ్యాణ్ భావోద్వేగానికి లోనయ్యాడు. చిన్నప్పటి నుంచి సినిమాలపై ఉన్న ప్రేమ, ఆర్మీలో పని చేస్తూనే బిగ్‌బాస్ కామనర్స్ ఎంట్రీకి అప్లై చేయడం, అగ్నిపరీక్షల తర్వాత హౌస్‌లోకి రావడం వరకు తన ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నాడు. ఈ ప్రయాణంలో చాలా బాధలు, నష్టాలు ఉన్నాయని చెప్పాడు. అలాంటి సమయంలో తనను పూర్తిగా అర్థం చేసుకున్న వ్యక్తిగా తనూజను పేర్కొన్నాడు. “ఈ బాండ్ లైఫ్ లాంగ్ ఉండాలి. ఇది సాధారణ ఫ్రెండ్‌షిప్ కాదు, మోర్ దెన్ ఫ్రెండ్‌షిప్” అంటూ కళ్యాణ్ చెప్పిన మాటలు హౌస్‌ను భావోద్వేగానికి గురి చేశాయి.

ఇదే ఎపిసోడ్‌లో జరిగిన టాస్కుల్లో డీమాన్ మరోసారి తన సత్తా చాటాడు. టీమ్ టాస్క్‌లో ఇమ్మానుయేల్‌తో కలిసి కళ్యాణ్–తనూజ జోడీని ఓడించాడు. అనంతరం జరిగిన ఇండివిడ్యువల్ టాస్క్‌లో కూడా విజయం సాధించి రెండు స్టార్స్ సంపాదించాడు. మొత్తానికి ఈరోజు ఎపిసోడ్‌లో భావోద్వేగాలు, బాండింగ్, పోటీ అన్నీ కలగలిసి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Also Read:కాంగ్రెస్ గుండాగిరిపై కేటీఆర్ కన్నెర్ర..

- Advertisement -