బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 9 తెలుగు విజయవంతంగా 96 రోజులు పూర్తి చేసుకుంది. బిగ్ బాస్ ఆట అంటేనే తికమక.. మకతిక. ఎప్పుడు ఎవరు ముందుకు వెళ్తారో, సడెన్‌గా ఎవరు వెనక్కి పడతారో చెప్పడం కష్టమే. బిగ్ బాస్ హౌస్‌లో ప్రతి మలుపు కొత్త డ్రామాకే దారితీస్తుంది. గెలుపు సూత్రం సింపుల్ — నీ కోసం నువ్వు ఆడితేనే నీ గేమ్ నిలుస్తుంది. కానీ ఎవరినో గెలిపించాలని ఆడితే.. నీ ఆటకే బ్రేక్ పడుతుంది. ప్రస్తుతం కళ్యాణ్ పరిస్థితి కూడా అలానే కనిపిస్తోంది.
ఎపిసోడ్ మొదట గుంటూరు కారం పాటకు హౌస్ మేట్స్ డాన్స్ చేస్తూ ఫుల్ మాస్ వైబ్స్ ఇచ్చారు. అనంతరం సంజనా భరణికి చెప్పిన డైలాగ్—“నాకు లైఫ్‌లో 1% కూడా డౌట్ లేదు” —తో కథ మొదలైంది. ఇమ్మానుయేల్, సంజన మధ్య ఉన్న ఇష్యూని భరణి, సుమన్ శెట్టి క్లియర్ చేయాలనుకున్నారు. ‘నువ్వు ఆమె వైపు నిలబడలేదా?’ అన్న ప్రశ్నకు ఇమ్మూ భావోద్వేగంతో స్పందించడం హౌస్‌లో టెన్షన్ పెంచింది.
అత్యంత కీలకమైన నెంబర్ గేమ్‌లో సుమన్ శెట్టి ఎలిమినేట్ అవ్వడం పెద్ద ట్విస్ట్. అతనికి వచ్చిన 50 పాయింట్లు ఎవరికి ఇవ్వాలనే విషయంలో భరణి పెట్టిన ఎమోషనల్ ప్రెజర్ పని చేసి.. చివరికి సుమన్ సంజనకు ఇవ్వడం హౌస్‌లో కొత్త లెక్కలు మొదలయ్యేలా చేసింది. దాంతో సంజనా 190 పాయింట్లతో మూడో స్థానానికి ఎగబాకగా, ఇమ్మానుయేల్, పవన్ స్థానాలు కదిలిపోయాయి.
తర్వాత హౌస్ సభ్యులందరూ కలిసి ఎవరు తదుపరి టాస్క్‌లో పాల్గొనకూడదన్న చర్చ మొదలైంది. కళ్యాణ్–డెమాన్–ఇమ్మూ ఒక గ్రూప్; భరణి–సంజనా–సుమన్ మరో గ్రూప్‌గా విభజం స్పష్టంగా బయటపడింది. భరణిని ఎలిమినేట్ చేయాలన్న ప్రయత్నం, తనూజ మాత్రం టార్గెట్ ఎప్పుడూ ఫస్ట్ ప్లేస్‌లో ఉన్న వారేనన్న ఆమె లాజిక్ గేమ్‌ను మరింత రసవత్తరం చేసింది.
చివరికి డెమాన్ పవన్ జీరో పాయింట్లతో గేమ్ నుంచి తప్పుకుని, తన పాయింట్లు కళ్యాణ్ ఒత్తిడితో తనూజకు ఇవ్వడం హౌస్ డైనమిక్స్‌ను పూర్తిగా మార్చేసింది. తనూజ టాప్‌లోకి వెళ్లగా, కళ్యాణ్ మాత్రం ఆమె సపోర్ట్ కోసం పనిచేయడం వలన తన గేమ్ వెనక్కి నెట్టుకున్నాడు.
Also Read:మంత్రి కొండాపై నాన్ బెయిలబుల్ వారెంట్

