​BB9:టార్గెట్ హరీష్‌..రచ్చరచ్చ!

6
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 9 తెలుగు విజయవంతంగా 9 రోజులు పూర్తి చేసుకుంది. రెండోవారం నామినేషన్స్ ప్రక్రియ వాడివేడిగా సాగింది. తాజా ఎపిసోడ్‌లో రీతూ చౌదరి ముందుగా హరిత హరీష్‌ని నామినేట్ చేసింది. ఈ క్రమంలో హరీష్ వర్సెస్ రీతూ మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. మీరు ఒక షోకి వచ్చి నలుగురు లేదా 14 మంది ఏదో అన్నారని నేను షోనే క్విట్ చేసి వెళ్లిపోతాను అంటే అది గివప్ ఇచ్చే పర్సనాలిటీయే కదా అని రీతూ కొశ్చన్ చేసింది. గివప్ కాదు బయట కొంతమందిని కాపాడుకోవాలి నేను.. అంటూ హరీష్ చెప్పాడు.

ఎంటర్‌టైన్ చేయని సందర్భాల్లో కూడా ఫుడ్ పెట్టాం.. అని హరీష్ అన్నాడు. వామ్మో సూపర్ యాక్టింగ్ అండి.. అని రీతూ అంటుంటే అమ్మా పెద్ద యాక్టర్ మీరు.. అంటూ దండం పెట్టాడు హరీష్. ఈ క్రమంలో రీతూ కన్నీళ్లు పెట్టుకుంది. రీతూ ఓ వైపు ఏడుస్తుంటే మీరు ఏడ్చి ఏదైనా ప్రూ చేయాలనుకుంటే.. అంటూ హరీష్ అన్నాడు. ఏడ్చి ప్రూ చేయాల్సిన అవసరం నాకు లేదు.. అని రీతూ అంది. సింపథీ కార్డ్ ప్లే చేయొద్దు.. మీకు ఫుడ్ పెట్టలేనప్పుడు మేము ఎంత మానసిక క్షోభకి గురయ్యామో మాకు తెలుసు అంటూ హరీష్ అరిచాడు.

ఆ తర్వాత దమ్ము శ్రీజ కూడా హరీష్‌ని నామినేట్ చేసింది. ఓనర్స్-టెనెంట్స్ అంటూ మనల్ని డివైడ్ చేశారు ఓకే.. కానీ ఎండ్ ఆఫ్ ది డే ఇది ఇండివీడ్యువల్ గేమ్ అలానే గ్రూప్ గేమ్ కూడా.. అయితే ఫస్ట్ డే మీరు ఫ్రూట్స్ ఇచ్చేటప్పుడు ఏదైనా అయితే నేను తీసుకుంటాను నాది బాధ్యత అన్నారు.. సెకండ్ పాయింట్ థంమ్స్ అప్ కూడా దొంగతనం చేశారు.. ఇవన్నీ మీ పర్సనల్ డెసిషన్స్.. అది నాకు నచ్చలేదు అంటూ శ్రీజ చెప్పింది.

మీరు నామినేషన్స్‌లో కూడా ఆయన్ని వెక్కిరించారు.. నోటికొచ్చినట్లు మాట్లాడతారు.. మీకు ఒక షో ఫార్మాట్‌కి వచ్చినప్పుడు రెస్పెక్ట్ ఇవ్వడం రాదు అంటూ హరీష్‌ను మరింత రెచ్చగొట్టింది శ్రీజ. దీంతో పంపిస్తే వెళ్లిపోతాం.. దమ్ముంటే అడగండి బిగ్‌బాస్‌ని అంటూ హరీష్ రెచ్చిపోయాడు. ఈ మాటకి తనూజ, రీతూ రియక్ట్ అయ్యారు. మీరు కరెక్ట్‌గా మాట్లాడండి.. దమ్ముంటే పంపించండి అనడమేంటి.. అంటే బిగ్‌బాస్‌కే దమ్ములేదు అంటున్నారా అని ఇద్దరూ మధ్యలో మాట్లాడారు అన్నారు.మొత్తంగా లేడి బ్యాచ్‌ అంతా హరీష్‌ని టార్గెట్‌ చేశారు.

Also Read:‘తెలుసు కదా’..షూటింగ్ పూర్తి

- Advertisement -