BB9:కళ్యాణ్‌పై నోరుజారిన భరణి!

9
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 9 తెలుగు విజయవంతంగా 89 రోజులు పూర్తి చేసుకుంది. బిగ్‌బాస్ సీజన్–9లో ఫస్ట్ ఫైనలిస్ట్‌ను నిర్ణయించే టాస్కులు పూర్తి స్థాయి యుద్ధ వాతావరణాన్ని తీసుకొచ్చాయి. ముఖ్యంగా నాకౌట్ టాస్క్‌లో రీతూ, భరణిని ఓడించి అందరినీ షాక్‌కు గురిచేసింది. భరణి ఎలిమినేట్ అయిన వెంటనే తనూజ వేసిన చిన్న పుల్లతో మొదలైన వాదన పెద్ద దుమారానికే దారి తీసింది. రీతూ వేసిన రింగ్స్‌లో ఒకటి ట్రయాంగిల్ ఆకారంలో లేదని తనూజ చెప్పడంతో భరణి ఆగ్రహంతో మండిపోయాడు.

“ఇది ట్రయాంగిల్ కాదు, రెక్టాంగిల్! నేను మ్యాథ్స్ స్టూడెంట్‌ని… నాలుగు భుజాలు ఉన్నాయి!” అని భరణి తీవ్రంగా రియాక్ట్ అయ్యాడు. అప్పటికే సంజన రీతూను విన్నర్‌గా ప్రకటించినా, భరణి మాత్రం గేమ్ ఆపకుండా రింగ్స్ వేసుకుంటూ టాస్క్‌ను కొనసాగించాడు. ఈ సమయంలో రీతూ కింద పడ్డ రింగ్‌ను తీసుకుని షర్ట్‌లో దాచుకోవడం ఆమె చేసిన పెద్ద తప్పు.

ఈ విషయం గుర్తించిన తనూజ, కావాలనే భరణిని ప్రేరేపించడంతో అతడిలోని బీపీ లెవెల్స్ పూర్తిగా పెరిగిపోయాయి. “ఇంతవరకూ సంచాలక్‌కి గౌరవంతో మౌనంగా ఉన్నా… ఇది టికెట్ టు ఫినాలే. ఇక్కడ ఎవరు ఎలా చీటింగ్ చేసారో నాకు బాగా తెలుసు” అంటూ భరణి తీవ్రంగా స్పందించాడు. భరణి చెప్పిన ఈ ‘షూ సైగ’ టాపిక్ కళ్యాణ్ మొదటి సారి కెప్టెన్ అయినప్పుడు జరిగిన ఘటన. కళ్యాణ్ పేరు ప్రస్తావించకపోయినా, ఆ ఇష్యూని indirect గా లాగడంతో కళ్యాణ్ క్లారిటీ ఇచ్చేందుకు ముందుకొచ్చాడు.

కళ్యాణ్ ప్రశ్నించగానే భరణి మరింత రెచ్చిపోయి, “నీ పేరు తెచ్చానా? మాట్లాడకు!” అంటూ కఠినంగా స్పందించడంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం పెరిగింది. దాంతో బాధపడిన కళ్యాణ్ పక్కకు వెళ్లి కన్నీళ్లు పెట్టుకోవాల్సి వచ్చింది.

తరువాత జరిగిన టాస్కుల్లో ఇమ్మానుయేల్-రీతూ పోటీలో రీతూ ఓడిపోయినా, తనూజ చూపించిన ఎక్స్‌ప్రెషన్లు హౌస్‌లో చర్చనీయాంశమయ్యాయి. చివరగా రీతూతో జరిగిన ఫైనల్ టాస్క్‌లో గెలిచిన కళ్యాణ్, సీజన్–9 ఫస్ట్ ఫైనలిస్ట్‌గా నిలిచాడు.

Also Read:‘సైక్ సిద్ధార్థ’..అందరికీ నచ్చుతుంది!

- Advertisement -