BB9:తనూజ టార్గెట్‌తో ఓడిన డీమాన్

2
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 9 తెలుగు విజయవంతంగా 86 రోజులు పూర్తి చేసుకుంది. బిగ్‌బాస్-9లో ఫస్ట్ ఫైనలిస్ట్ కాగల అవకాశం కోసం ఈరోజు టాస్క్‌లు ప్రారంభమయ్యాయి. హౌస్‌మేట్స్‌కి బిగ్‌బాస్ వారి వారి పేర్లతో కలర్ బాక్స్‌లు కేటాయించాడు. వాటి పక్కన ఖాళీ గడులు ఉంచి, మొదటి రౌండ్ ఆడేందుకు ముగ్గురి పేర్లు మీరే డిసైడ్ కావాలని చెప్పి గేమ్‌కి మలుపు ఇచ్చాడు. కళ్యాణ్–ఇమ్మానుయేల్–డీమాన్ ముందుకు రాగా, భరణి కూడా ఆడమని అడిగాడు. ఆ సమయంలో తనూజ సైలెంట్‌గా భరణి వెనకాల గోకుతూ “మీరు ఆగిపోయండి” అంటూ సిగ్నల్ ఇచ్చింది. తనూజ ప్లాన్ అర్థం కాని భరణి ఆమె మాట విని వెనక్కి తగ్గాడు. అసలు ఆ గోకుడు వెనుక ఉన్న ప్లాన్ ప్రేక్షకులకు తర్వాతే తెలిసింది.

మొదటి రౌండ్‌లో ఇమ్మానుయేల్, కళ్యాణ్‌తో పాటు రీతూ బరిలోకి దిగి, డీమాన్ తప్పుకున్నాడు. చివరకు ఇమ్మానుయేల్ గెలిచాడు. రెండో రౌండ్‌కి భరణి–తనూజ–డీమాన్ రంగంలోకి దిగి ‘నాటు నాటు’ టాస్క్ ప్రారంభమైంది. మట్టి గుంటలో కలర్ పూలు నాటడం ఈ టాస్క్ రూల్. సంచాలకుడిగా కళ్యాణ్‌ను పెట్టమంటూ ముందుగానే తనూజ చెప్పడం కూడా ఆమె మైండ్ గేమ్‌లో భాగమే.

గేమ్ మొదలుతానే డీమాన్ తన పూలను దూరంగా నాటి, తాను మాత్రమే డామినేట్ చేసేలా స్ట్రాటజీ పెట్టాడు. ఇది చూసి తనూజ రెచ్చిపోయి డీమాన్‌తో వాదన మొదలెట్టింది. డీమాన్ మాత్రం తన పూల్ని కాపాడుకునేందుకు భరణి–తనూజ ఇద్దరినీ ఆపేందుకు ఫిజికల్ ప్లే చేశాడు. దీంతో ఇద్దరూ అతని పైనే టార్గెట్ అయ్యారు. డీమాన్ ఫిజికల్‌గా ఆడుతున్నాడని తనూజ ఎదురు మాట్లాడినా, అసలు ఇద్దరూ కలిసే అతని పూలను పీకడం స్పష్టమైంది.

ఎండ్‌లో బజర్ మోగే సమయానికి డీమాన్ ఒక పువ్వే మట్టిలో ఉండగా, భరణి ఆలస్యంగా పెట్టాడు. తనూజ పూలు మట్టిలో ఉన్నా, చేతులు వాటిపైనే ఉన్నాయి. డీమాన్ ఈ పాయింట్ చెప్పినా, కళ్యాణ్ పట్టించుకోకుండా తనూజనే విన్నర్‌గా ప్రకటించాడు.

Also Read:TG:సర్పంచ్ ఎన్నికలు..వరాల జల్లు

గేమ్ అయ్యాక తనూజ–భరణి ఇద్దరూ “మేమెవరికోసం ఆడలేదు, మన గేమ్ మనదే” అంటూ బయట చూపు కోసం మాటలు మార్చుకున్నారు. కానీ నిజానికి, తనూజ వల్లే డీమాన్ ఓడిపోయాడు. ఇదే ఆమె అసలు మేజిక్!

- Advertisement -