BB9:రీతూ-డీమాన్‌..సంజన వివాదం

6
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 9 తెలుగు విజయవంతంగా 79 రోజులు పూర్తి చేసుకుంది. తాజా ఎపిసోడ్‌లో భాగంగా ఈ వారం నామినేషన్స్ సందర్భంగా రీతూ చౌదరి మరియు డీమాన్ పవన్‌ల సంబంధంపై సంజన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పెద్ద రచ్చకు దారి తీశాయి. ఇద్దరూ రాత్రి ఒకరి చేతిలో ఒకరు వేసుకొని కూర్చుంటున్నారు. అంటూ సంజన చేసిన కామెంట్ హౌస్‌మేట్స్‌ను కలవరపరిచింది.

సంజన చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని దాదాపు హౌస్‌మేట్స్ అందరూ అభ్యర్థించినప్పటికీ, సంజన మాత్రం “నో సారీ చెప్పేదేలే” అంటూ మొండి పట్టుదలతో తేల్చి చెప్పింది.గొడవ జరిగిన తర్వాత రీతూ ఏడుస్తూ వాష్‌రూమ్‌లోకి వెళ్లగా, డీమాన్ ఆమెను బయటకు రమ్మని రిక్వెస్ట్ చేశాడు. ఆ తర్వాత అక్కడికి వెళ్లిన తనూజ, రీతూకి ధైర్యం చెప్పింది. “ఆవిడ మాటలకి నువ్వు అంత విలువ ఇస్తావా? ఒకరు ఒక మాట అనేసినంత మాత్రాన క్యారెక్టర్ ఎక్కడికీ పోదు. మీకు మీ మీద కాన్ఫిడెన్స్ ఉంటే ఏం కాదు. దయచేసి గేమ్ ఆడండి” అంటూ తనూజ ఓదార్చింది.

అనంతరం రీతూ, కళ్యాణ్‌తో జరిగిన గొడవ గురించి చెబుతూ, తను సెల్ఫిష్ కాదని, తన కోసం ఆడావా లేక ఓట్లు పడ్డాయని వెళ్లిపోయావా అని డీమాన్‌ను అడగగా, ఓట్లు పడ్డాయని వెళ్లిపోయాను అని డీమాన్ చెప్పాడు.

మరోవైపు, ఇమ్మానుయేల్ మరియు భరణి సంజన వద్దకు వెళ్లి, ఆమె మాటలు తప్పు అని అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నించారు. “వాళ్లు అలా అంటుకొని ఉంటే నాకు చూడటానికి కంఫర్ట్ లేదు. నేను చెప్పాలనుకున్నది మాత్రం ఇదే. ఏమైనా సరే నేను ఫేస్ చేస్తాను” అంటూ సంజన తన వాదనను సమర్థించుకుంది. ఇమ్మూ ఆమెకు సారీ చెప్పమని చెప్పినా, “నేను చెప్పే ముందు తను (రీతూ) సారీ చెప్పాలి, తనే కదా ముందు మొదలుపెట్టింది” అంటూ సంజన కోపంతో తిరస్కరించింది.

Also Read:లోకల్ బాడీ ఎన్నికలు..మండలాల వారీగా వివరాలు

కెప్టెన్సీ రూమ్‌లో రీతూ-డీమాన్‌లను కూర్చోబెట్టి తనూజ క్లాస్ పీకింది. డీమాన్‌తో, “నీకు తన మీద ఎలాంటి ఎఫెక్షన్స్ ఉన్నా ఓకే. కానీ తనను తనలా వదిలెయ్. రీతూ ఎవరితోనైనా మాట్లాడితే నువ్వు జెలసీ ఫీలవుతున్నావ్. ఇవన్నీ ప్లీజ్ 5 వారాలు పక్కన పెట్టెయ్” అంటూ హితవు పలికింది. డీమాన్ తన బాధను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.

- Advertisement -