BB9:ఈ వారం నో ఎలిమినేషన్

5
- Advertisement -

బిగ్‌బాస్ సీజన్-9లో హోస్ట్ నాగార్జున పదేపదే తనూజకు మద్దతుగా మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది. “తనూజని ఇష్టపడని వాళ్లు కూడా ఉంటారా?”, “తనూజ ఏం జరిగింది చెప్పమ్మా” వంటి వ్యాఖ్యలు చేస్తూ, ఆమెకు ఇంటా బయటా సపోర్ట్ వస్తున్నట్లుగా చిత్రీకరిస్తున్నారు.

అయితే, శనివారం ఎపిసోడ్‌లో దివ్య-తనూజ పంచాయితీలో నాగార్జున పూర్తిగా తనూజ వైపే మొగ్గు చూపారని నెటిజన్లు విమర్శిస్తున్నారు. దివ్య మాట్లాడేటప్పుడు కట్ చేసి, ఆమెదే తప్పు అనిపించేలా ప్రశ్నలు వేయడంపై సోషల్ మీడియాలో విపరీతమైన నెగెటివిటీ వచ్చింది. నెటిజన్లు మాత్రం దివ్యను ఆకాశానికి ఎత్తేశారు.

ఈరోజు ఎపిసోడ్‌లో, నామినేషన్స్‌లో ఉన్న అందరూ సేవ్ అయ్యాక, చివరికి సంజన-దివ్య ఎలిమినేషన్ జోన్‌లో మిగిలారు. ఇక్కడే నాగార్జున ట్విస్ట్ ఇచ్చారు. ఇమ్మానుయేల్‌కి ఉన్న ‘పవరాస్త్ర’ మూడో పవర్ గురించి తెలిపారు: ఈ వారం ఎలిమినేషన్‌ను క్యాన్సిల్ చేసే అధికారం.తనూజ చేతిలో గతంలో గోల్డెన్ బజర్ ఉన్నా ఆమె ఆడియన్స్ డెసిషన్‌ను గౌరవించి వాడలేదని పదేపదే గుర్తుచేస్తూ, “వాడేస్తావా? లేక ఆడియన్స్ నిర్ణయమే ఫైనల్ అని వదిలేస్తావా?” అంటూ నాగార్జున ఇమ్మానుయేల్‌పై ఒత్తిడి తెచ్చారు.

కాసేపు ఆలోచించిన ఇమ్మానుయేల్, “వారిద్దరికీ ఇంకో వారం తమను తాము ప్రూవ్ చేసుకునే ఛాన్స్ ఇవ్వాలని” పవరాస్త్రను ఉపయోగించి ఎలిమినేషన్‌ను క్యాన్సిల్ చేశాడు.ఎలిమినేషన్ క్యాన్సిల్ అయినప్పటికీ, ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం ఎవరు ఎలిమినేట్ అయ్యారో తెలుసుకోవాలని నాగార్జున అడిగారు. ఓటింగ్ ప్రకారం దివ్య ఎలిమినేట్ అయిందని, సంజన సేఫ్ అని తేలింది. దీంతో ఇమ్మానుయేల్ పవర్ వల్లే దివ్యకు లైఫ్ దొరికింది.

అయితే, ఇమ్మానుయేల్ డెసిషన్‌పై నాగార్జున సంతృప్తి చెందలేదు. “కాంపిటీషన్ టఫ్‌గా ఉన్నప్పుడు ఒక పోటీదారుడిని తగ్గించుకోవడం గేమర్‌గా నీకు రైట్ అనిపించలేదా?” అంటూ ఇమ్మానుయేల్‌పై ప్రశ్నలు గుప్పించారు. తనూజ కూడా పవర్ వాడకపోతే టికెట్ టు ఫినాలే వంటి బెనిఫిట్స్ వచ్చే అవకాశం ఉండేదని అనుమానం వ్యక్తం చేసింది.

Also Read:రేవంత్ క్షమాపణ చెప్పాలి: కేటీఆర్

- Advertisement -