బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 9 తెలుగు విజయవంతంగా 51 రోజులు పూర్తి చేసుకుంది. తాజా ఎపిసోడ్‌లో భాగంగా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు భరణి. దీంతో వెంటనే పరుగెత్తుకెళ్లి హత్తుకుంది దివ్య. తర్వాత తనూజ వెళ్లి నాన్న మిస్ అయ్యా నిన్ను చాలా అంటూ జరజరా కళ్లల్లో ట్యాప్ విప్పేసింది. హెల్త్ ఎలా ఉంది.. అబ్బా ఎంత బావున్నారో తెలుసా.. అంటూ తనూజ అంది. ఇమ్మానుయేల్‌ని హత్తుకొని కట్టప్ప.. చంపేశావ్ కదా అమరేంద్ర బాహుబలిని.. మహేంద్ర బాహుబలి వచ్చాడు కట్టప్ప.. చలో గుడ్ గేమ్ ఇమ్మానుయేల్ అంటూ షాకిచ్చాడు.
ఆ తర్వాత నామినేషన్స్‌లో భాగంగా సంజనని నామినేట్ చేశాడు భరణి. మీరు రూల్స్ మాట్లాడతారు కానీ మీరే బ్రేక్ చేస్తారు.. వచ్చిన కొత్తలో మీరు టస్క్‌లు ఆడగలరా అంత ఫిట్‌గా లేరేమో అని నేను అన్న మాటని మీరు బాడీ షేమింగ్ చేశాను అన్నట్లు చెప్పారు అని తన రీజన్ చెప్పారు. తన చేతిలో ఉన్న రెండో కత్తి భరణి ఎవరో ఒకరికి ఇవ్వాలన్న సంగతి తెలిసిందే. దివ్య తనకు ఇవ్వాలని కోరగా బిగ్‌బాస్ నేను నిఖిల్‌కి ఇస్తున్నా అని షాకిచ్చాడు భరణి.
భరణి టైమ్ అవ్వడంతో వెళ్లే ముందు సుమన్ శెట్టిని పట్టుకొని ఎమోషనల్‌గా మాట్లాడాడు. ఆల్ గుడ్.. బీ హ్యాపీ ఏది స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు.. ఏ టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు.. లవ్యూ.. ఈ హౌస్‌లో ఎవరినీ నమ్మొద్దు అని భరణి అన్నాడు. ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ ముగియగా మాధురి, సంజన, రాము, కళ్యాణ్, తనూజ, రీతూ, డీమాన్, గౌరవ్ ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నారని బిగ్‌బాస్ అనౌన్స్ చేశాడు.
Also Read:కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్

