బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 9. తెలుగులో 9వ సీజన్ ఇటీవలె ప్రారంభంకాగా రెండో రోజు పూర్తి చేసుకుంది. ఈ ఎపిసోడ్‌లో సిల్లీ విషయాల గురించి రోజంతా సాగింది. దాదాపు 30 నిమిషాల పాటు షాంపు బాటిల్ గురించే చర్చ పెట్టారు ఇంటి సభ్యులు.
అగ్నిపరీక్ష దాటుకొని వచ్చిన కారణంగా హౌస్‌లో ఓనర్స్ అనే హోదాతో పాటు పలు లగ్జరీలు కూడా అనుభవిస్తున్నారు కామనర్లు. దమ్ము శ్రీజ, ప్రియ ముందుగా సంజన పేరు ప్రస్తావించారు. వంట రాకుండ కుకింగ్ చేస్తానని తీసుకుంది.. తర్వాత నాకు వంట రాదు అంటూ పిచ్చిపిచ్చిగా చేసింది.తర్వాత సంజన తన వాదన వినిపించింది. మీరు మైక్ కూడా సరిగా పెట్టుకోరు.. రికార్డ్ కాకుండా ఉండాలని దాచి మాట్లడుతున్నారు.. అలానే బ్యాక్ బిచ్చింగ్ (వేరే వాళ్ల గురించి వెనకాల మాట్లాడటం) చేస్తారని ప్రియ చెప్పింది. దీంతో సంజన ఫైర్ అయింది.
ఇక ఇదే విషయం గురించి రాత్రి బెడ్ మీద పడుకున్న సమయంలో తనూజ డిస్కస్ చేసింది సంజన. ఉదయం కాగానే పుష్ప సినిమాలో ఎవడ్రా ఎవడ్రా నువ్వు అనే పాటకి ఊపు వచ్చేలా అందరూ స్టెప్పులేశారు. తర్వాత హౌస్‌లో ఉన్న సంజన దగ్గరికొచ్చి చాలా మర్యాదగా ఒక విషయం అడిగింది ఫ్లోరా. బాత్రూంలో కండీషనర్, షాంపు బాటిల్స్ వదిలేశారు అవి మీవేనా అని అడిగితే అవును అంటూ సంజన చెప్పింది. అవి తీసి బయటపెట్టుకోండి వేరే వాళ్లు వెళ్లినప్పుడు ఇబ్బంది కదా అలా ఫ్లోర్ మీదే ఉంటే అంటూ ఫ్లోరా చెప్పింది. ఈ మాటలకి ఎమోషనల్ అయిపోయిన ఫ్లోరా అక్కడి నుంచి వెళ్లిపోతూ కన్నీళ్లు పెట్టుకుంది.
ఇక బాత్రూం దగ్గరికెళ్లి ఫ్లోర్ మీద ఉన్న షాంపు, కండీషనర్ తీసుకొని కెమెరా ముందు బిల్డప్ ఇచ్చింది సంజన. ఈ రెండు బాటిల్స్ గురించి ఇంత గొడవ అవసరమా.. బాత్రూంలో యూజ్ చేసేవి అక్కడ కాకపోతే నెత్తిన పెట్టుకుంటారా అంటూ సంజన అంది. తర్వాత నామినేషన్స్‌కి అన్ని ఏర్పాట్లు చేసి అనౌన్స్ చేశాడు బిగ్‌బాస్. మొదటి పోటీదార్లుగా రీతూ, తనూజని పిలిచాడు బిగ్‌బాస్. రీతూ పాకుతూ పక్కనే ఉన్న పోల్‌ని గుద్దుకొని దెబ్బ తగిలించుకుంది. దీంతో వెంనటే మెడికల్ రూమ్‌కి పిలిచి తలకి కట్టు కట్టారు. తనూజ గెలవడంతో రీతూ ఫొటోని పగలగొట్టి సంజనని నామినేట్ చేసింది. షాంపు గురించి అంత గొడవ చేయడం కరెక్ట్ అనిపించలేదని రీజన్ చెప్పింది.
ఆ తర్వాత రాము రాథోడ్, శ్రష్టి వర్మని పిలిచాడు బిగ్‍బాస్. వీళ్లిద్దరిలో ముందుగా వెళ్లి సుత్తి అందుకొని శ్రష్టి ఫొటో పగలగొట్టాడు రాము. తర్వాత సుమన్ శెట్టిని నామినేట్ చేస్తున్నట్లు చెప్పాడు. ఇక్కడున్న వారంతా చాలా యంగ్‌గా, ఎనర్జిటిక్‌గా అనిపిస్తున్నారు.. కానీ సుమన్ అన్న మాత్రం అంతగా యాక్టివ్‌గా లేరని రీజన్ చెప్పాడు.
Also Read:ఆర్‌ఎస్‌ఎస్ నుండి ఉపరాష్ట్రపతిగా!

