బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 9 తెలుగు విజయవంతంగా 19 రోజులు పూర్తి చేసుకుంది. హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా దివ్య నికితాకి షాకిచ్చాడు బిగ్‌బాస్. ఇవాళ్టి ఎపిసోడ్‌లో మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటూ అందర్నీ భయపెట్టాడు. అంతేగాదు హౌస్ నుంచి సంజనని ఎలిమినేట్ చేస్తూ హౌస్‌మేట్స్‌కి మరో షాకిచ్చాడు. ఇక కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా ఐదుగురు పోటీ పడగా ఇమ్మానుయేల్ గెలిచి హౌస్‌కి మూడో కెప్టెన్ అయ్యాడు.
ఇంటి సభ్యులందరూ ఇప్పటివరకూ మీకు లభించిన ఫలాల్లోని బ్లూ, బ్లాక్ సీడ్స్ ఏం తీసుకొచ్చాయో చూశారు. ఇప్పుడు రెడ్ సీడ్ పొందిన వారి వంతు.. ఎప్పుడూ లేని విధంగా రెడ్ సీడ్ పొందినవారికి ఇంటి నుంచి ఒకర్ని బయటికి పంపే అధికారాన్ని నేను ఇస్తున్నాను. దివ్య నేను పంపిన సభ్యురాలు కాబట్టి.. ఫ్లోరా తన ఇమ్యూనిటీని గెలుచుకొని ఈ వారం సేవ్ అయ్యారు అని చెప్పారు బిగ్ బాస్.
రెడ్ సీడ్ పొందిన భరణి, హరీష్, కళ్యాణ్, డీమాన్, రాము మాట్లాడుకోవడానికి లోపలికెళ్లారు. హరీష్ అయితే ముందుగానే తన ఒపీనియన్ చెప్పాడు. హరీష్ .. సంజన పేరు చెబుతూ తన రీజన్ చెప్పాడు. అందరూ ఏకాభిప్రాయంతో సంజన పేరునే డిసైడ్ కాగా మిగతా సభ్యుల సూట్‌కేసులన్నీ స్టోర్ రూమ్ నుంచి తీసుకొని లివింగ్ ఏరియాకి రండి అని బిగ్‌బాస్ అడిగాడు. దీంతో బిగ్‌బాస్ సంజన .. అంటూ హరీష్ చెప్పాడు.
Also Read:TG:డీజీపీగా శివధర్ రెడ్డి
అందరూ మాట్లాడేశాక నేను మాట్లాడొచ్చా బిగ్‌బాస్ అంటూ సంజన తన అభిప్రాయం చెప్పింది. ఇవాళ జరిగిందేంటి (దివ్య వస్తువుల దొంగతనం).. అందులో నేను ఒంటరిగా లేను కదా.. కానీ వాళ్లకి నేను ఒక్కదాన్నే కనిపిస్తున్నానా నాకు తెలీదు, నా పరంగా నేను 100 కాదు 500 పర్సంట్ షో కోసం ఇచ్చాను.. ఆ తృప్తి నాకు ఉంది.. నేను ఈ హౌస్‌లో ఉండటానికి అర్హత ఉందని అనుకుంటున్నాను అంటూ సంజన చెప్పింది. రెడ్ సీడ్ పొందిన వారు ఇంటి నుంచి బయటికి పంపేందుకు నిర్ణయించిన సంజన సూట్‌కేస్‌ని మెయిన్ గేట్ బయట పెట్టండి అని చెప్పగా సంజనని హత్తుకొని ఫ్లోరా ఎమోషనల్ అయింది. చివరగా ఇమ్మూకి ధైర్యం చెప్పి అందరికీ బైబై చెప్పేసింది సంజన.
సంజన వెళ్లిపోయాక ఇమ్మూ ఇంకా ఎమోషనల్ అయిపోయాడు. ఇమ్మూ ఏడుస్తూనే ఉండేసరికి ఏయ్ ఏడవకు స్టుపిడ్ వస్తాను మళ్లీ.. అంటూ సీక్రెట్ రూమ్‌లో సంజన మాట్లాడింది. ఆవిడ లేకపోతే హౌస్‌లో మజా ఉండదండి అంటూ ఇమ్మూ చెబుతుంటే సీక్రెట్ రూమ్‌లో సంజన కూడా కన్నీళ్లు పెట్టుకుంది. స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంది ఆమె తిరిగి వస్తుందని.. అంటూ ఇమ్మూతో భరణి అన్నాడు.

