బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 9 తెలుగు విజయవంతంగా 18 రోజులు పూర్తి చేసుకుంది. ఇక తాజా ఎపిసోడ్‌లో భాగంగా బిగ్‌బాస్ హౌస్‌లోకి కొత్త కంటెస్టెంట్ అడుగుపెట్టింది. దివ్య నికితా (వెజ్ ఫ్రైడ్ మోమో) వైల్డ్ కర్డ్ ఎంట్రీ ద్వారా లేటెస్ట్ ఎపిసోడ్‌లో హౌస్‌లోకి వచ్చింది.
నిజానికి అగ్నిపరీక్ష నుంచి దివ్యతో పాటు మరో ముగ్గురిని అనూష రత్నం, నాగ ప్రశాంత్, షాకీబ్‌లని హౌస్‌లోకి పంపించాడు బిగ్‌బాస్. ఈ హౌస్‌లో మీరు ఎందుకు ఉండాలి.. అనేది హౌస్‌మేట్స్‌కి, ఆడియన్స్‌కి అర్థమయ్యేలా ఒకే ఒక అప్పీల్ చేసుకోండి అంటూ బిగ్‌బాస్ అవకాశం ఇచ్చాడు. దీంతో నలుగురూ వాళ్ల వాళ్ల స్టయిల్లో అప్పీల్ చేసుకున్నారు.
ముందుగా శ్రీజ పైకి లేచి మీరు హౌస్‌లోకి రావాలనుకుంటే ఇక్కడున్నవాళ్లలో ఎవరిని స్వాప్ చేస్తారు, ఎందుకు.. రీజన్ చెప్పండి అని అడిగింది. దీనికి నేను అయితే నిన్నే స్వాప్ చేస్తా శ్రీజ… ఎందుకంటే హౌస్‌లో నీ అంత నెగెటివిటీ ఎవరి దగ్గరా లేదు అని చెప్పింది. ఇక షాకీబ్, నాగని ఇదే కొశ్చన్ అడగ్గా ఇద్దరూ పవన్ కళ్యాణ్‌తో స్వాప్ చేస్తామంటూ బదులిచ్చారు. అగ్నిపరీక్షలో నువ్వు చాలా బాగా ఆడావ్.. కానీ హౌస్‌లో ఆ ఫైర్ ఎక్కడా కనిపించట్లేదు.. అసలు నీ గేమ్ కూడా కనిపించట్లేదు.. అందుకే నిన్ను నేను రీప్లేస్ చేస్తానంటూ నాగ అన్నాడు.
Also Read:సుధీర్ బాబు..’జటాధర’
కాసేపటికి బిగ్‌బాస్ అందరికీ దిమ్మతిరిగే షాకిచ్చాడు. ఓటు ద్వారా మీ అభిప్రాయన్ని మీరు చెప్పారు. ఇప్పుడు నా రిజల్ట్ మీరు చూడండి అంటూ డోర్స్ ఓపెన్ చేశాడు. దివ్య నికితా ఎంట్రీ ఇచ్చింది. ఇది చూసి అందరూ అవాక్కయ్యారు. చదరంగంలో మీ పావులు మీరు కదిపారు.. దివ్యకి అందరికంటే తక్కువ ఓట్స్ వేసి నా ఇంట్లోకి రాకుండా చేయాలనుకున్నారు…హలో గైస్ ఎలా నడుస్తుంది.. అంటూ కామనర్లని దివ్య పలకరించింది… నువ్వు చెప్పాలి ఎలా నడుస్తుందో.. అంటూ వాళ్లు అన్నారు. ఇక దివ్యని కూర్చోబెట్టి హౌస్‌మేట్స్ కొంతమంది ముచ్చట్లు పెట్టారు. ఎపిసోడ్స్ అన్నీ ఫాలో అయ్యారా.. అని ఇమ్మూ అడిగాడు.
ఇక ఈ విషయం వినగానే కళ్యాణ్‌ని తీసుకొని ఆత్రంగా రీతూ దగ్గరికెళ్లింది ప్రియ. హౌస్‌లో గజదొంగగా అన్నీ కొట్టేస్తున్న సంజన మరో ప్లాన్ వేసింది. ఇమ్మానుయేల్, ప్రియ ఇద్దరినీ పక్కకి పిలిచి వెల్కమ్ చేయాలి కొత్త అమ్మాయిని.. ఇప్పుడు తను మొత్తం మేకప్ కిట్ తన బెడ్ దగ్గర ఉన్న సరుగులో పెట్టింది.. అది కొట్టేయాలి.. ఉదయానికి ఒక్కటి కూడా ఉండకూడదు అని చెప్పారు. తన బెడ్ దగ్గర సర్దుకుంటూ కెమెరాతో మాట్లాడింది దివ్య. లవ్ ట్రాక్ అది కూడా చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు నేను ఒక్క మాట చెప్తే ఈ ఒక్క దానికి నలుగురు షేక్ అయ్యారు హౌస్‌లో.. ఇప్పుడు దాన్ని బట్టి వాళ్ల బిహేవియర్ ఎలా మారుస్తారో ఏంటి అని ఆడియన్స్ చూడాలి.. అప్పుడు ఎవరు ఎంత జెన్యూన్.. ఎవరు ఊరికే ఫుటేజ్ కోసం లవ్ ట్రాక్ మెయింటైన్ చేస్తున్నారు ఎవరికి నిజంగా ఫీలింగ్స్ ఉన్నాయి ఏంటో మరి తెలీదు కానీ అది తెలుసుకుందామని ఒక రాయి వేశా.. జనాల ముఖాలు మాడిపోయాయి.. అంటూ దివ్య మాట్లాడింది.

