కళ్యాణ్‌ చేసిన పనికి ఇమ్మూ హార్ట్!

4
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 9 తెలుగు విజయవంతంగా ఏడోవారం నామినేషన్స్‌ వాడివేడిగా సాగాయి. తనూజ గౌడ-రమ్య మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరాయి. మరోవైపు కళ్యాణ్ చేసిన ఒక పనితో ఇమ్మూ మనసు విరిగిపోయింది. ఆ తర్వాత తనూజను నామినేట్ చేసింది రమ్య. నువ్వు ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటివరకూ ఒక్క టాస్క్ కూడా ఆడలేదు.. ఎవరో ఒకరు నీకు ఇలా తీసుకొచ్చి ఇలా ముందుపెడితే కానీ ఆడలేవు నువ్వు ఫేక్ అంటూ తన రీజన్స్ చెప్పింది రమ్య.

దీనికి తనూజ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. నువ్వు నీ గేమ్ ఆడటానికి వచ్చావ్.. నువ్వు వచ్చిన పని నువ్వు చూసుకోకుండా అందరూ ఏం చేస్తున్నారు.. ఎవరు ఎంతసేపు మాట్లాడుతున్నారు.. వచ్చిన రెండు రోజులకే ఎవరి గురించి ఎలాంటి మాటలు మాట్లాడి కన్ఫెషన్ రూమ్‌లో ఏం అనిపించుకున్నావో నీకే తెలుసు.. అంటూ తనూజ ఫైర్ అయింది.

తర్వాత తనూజ తన వంతు రాగానే రమ్యని నామినేట్ చేసింది. హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వడం ఇవ్వడమే పికిల్స్ తెచ్చారు.. ఓవరాక్టింగ్, సెల్ఫిష్, మేనిపులేటర్ అంటూ కొన్ని ట్యాగ్స్ కొంతమందికి ఇచ్చారు.. కానీ అవన్నీ మీకే బాగా సూట్ అవుతాయి అంటూ తనూజ రీజన్స్ చెప్పగా రమ్య పర్సనల్‌గా తనూజని టార్గెట్ చేసింది. ఇలా వీరిద్దరి మధ్య మాటల యుద్ధం చాలా సేపు జరిగింది.

తర్వాత కళ్యాణ్ తనవంతు రాగా సంజన, ఇమ్మాన్యుయేల్‌ని నామినేట్ చేశాడు. దీంతో ఇమ్మానుయేల్ హర్ట్ అయ్యాడు.నువ్వు నాకు నామినేషన్ చేస్తానని చెప్పిన పేరు ఒకటి.. చేసిందొకటి దానికి రీజన్ తెలుసుకోవచ్చా.. అని ఇమ్మూ అడిగాడు. నాకు నువ్వు చేసింది అసలు నచ్చలేదు కళ్యాణ్.. తనూజకి కూడా నేను ఇది డైరెక్ట్‌గా చెప్తున్నాను.. నేను ఈ వీక్ తనని నామినేట్ చేద్దామనుకున్నాను.. కానీ నువ్వు అడిగావని.. తనూజని నామినేట్ చేస్తానని చెప్పావనే ఇచ్చాను.. డీమాన్-రీతూ నీకు చేసింది మోసం అయితే నువ్వు ఇప్పుడు నాకు చేసింది కూడా మోసమే.. కళ్యాణ్ అనేవాడు ఒక పర్సన్ మీద చెప్తే కళ్యాణ్‌ని నమ్మేవాళ్లు అందరూ నమ్ముతారు అది అని చెప్పాడు. నిన్ను నమ్మాను.. అంటూ ఇమ్మూ చెప్పాడు. దీంతో రియల్లీ సారీ అన్నా.. అంటూ కళ్యాణ్ అన్నాడు. నేను ఒక్కటే నమ్మాను.. కళ్యాణ్ అనేవాడు తనూజ గురించి ఏం చెప్తాడని అది నాకు కావాలి.. ఆడియన్స్‌కి అది కావాలి.. షోకి అది కావాలి. అంటూ ఇమ్మూ ఫైర్ అయ్యాడు.

Also Read:Chiru:మెగా దీపావళి

- Advertisement -