BB9:పదోవారం నామినేషన్స్‌

6
- Advertisement -

గత వారం డబుల్ ఎలిమినేషన్‌లో భాగంగా ఇంటి నుండి సాయి శ్రినివాస్, రాము రాథోడ్‌ బయటకురాగా ఇక మిగిలింది ఐదు వారాలే. హౌస్‌లో మిగిలింది 11మంది. ఇక పదోవారం నామినేషన్స్‌కు సంబంధించిన ప్రొమో రిలీజ్ చేయగా వాడివేడిగా సాగినట్లు తెలుస్తోంది. మాత్రమే మిగిలారు.

నామినేషన్స్‌కి సంబంధించిన ప్రోమోలో కేవలం ఐదు నిమిషాల సమయంలోనే నామినేషన్స్‌ని ముగించాలని ట్విస్ట్ ఇచ్చారు బిగ్ బాస్. రీతూ చౌదరి.. దివ్యని నామినేట్ చేస్తూ కరెక్ట్ పాయింట్లను పెట్టింది.

ఇద్దరు ముగ్గుర్ని పెట్టుకుని ఒక గ్యాంగ్‌లా ఉంచుకుంటావ్. వాళ్లంతా నువ్వు చెప్పినట్టే వినాలని చేస్తావ్. వాళ్లపై బాణాలు వదలుతుంటావ్ అని దివ్య బాణాలను బయటపెట్టింది రీతూ. దాంతో దివ్య….వాళ్లు ఏమైనా చిన్న పిల్లలా? నేను ఎవరికైనా సపోర్ట్ చేస్తున్నానంటే నేను గెలవాలనే.. వాళ్ల కోసం కాదు అని తెలిపింది.

నువ్వు కామాండ్ చేసి.. ఆర్డర్ చేసి వాళ్లని ముందుకు రాకుండా ఆపేస్తున్నావ్.. మొన్నటి ట్రైన్ టాస్క్‌లో కూడా.. నీ ఆట నువ్వు ఆడకుండా.. ఆగు.. చెయ్.. ఒక్క నిమిషం.. నేను చెప్తా’ అంటూ వాళ్లని బొమ్మల్లా ఆడిస్తున్నావ్ అంటూ అని కౌంటర్ ఇచ్చింది రీతూ. సరిగ్గా ఆ గేమ్‌లో దివ్య.. ఎలాగైతే చేసిందో అదే చేసి చూపించింది రీతూ.

Also Read:అందెశ్రీ మృతి..కేసీఆర్ సంతాపం

- Advertisement -