బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 8 తెలుగు విజయవంతంగా 33 రోజులు పూర్తి చేసుకుంది. తాజా ఎపిసోడ్‌లో భాగంగా ఇంటి సభ్యులకు సర్‌ప్రైజ్ ఇస్తూనే ఓ మెలిక పెట్టారు బిగ్ బాస్. ఒక్కొక్కరిని కన్ఫెక్షన్ రూమ్‌లోకి పిలిచి వారి బెస్ట్ ఫ్రెండ్, ఇష్టాలు అడుగుతూనే వారి స్నేహితుల ఇళ్ల నుండి వచ్చిన ఫుడ్‌ను ఇవ్వాలని అయితే ఒక్కరికే ఇవ్వాలంటే ఎవరికి ఇస్తారంటూ ట్విస్ట్ పెట్టారు.
తొలుత యష్మీ…మణికంఠ,నిఖిల్‌లలో నిఖిల్ పేరును ఎంచుకోగా తర్వాత పృథ్వీని కన్ఫెషన్ రూమ్‌కి పిలిచాడు బిగ్‌బాస్. ఇంట్లో మీకు బాగా నచ్చిందెవరూ అని అడిగితే నిఖిల్, యష్మీ అంటూ బదులివ్వగా తర్వాత పృథ్వీ ఎదురుగా ఉన్న క్లాత్ తీసేసరికి అక్కడ రెండు డిష్‌లు కనిపించాయి. విష్ణుప్రియకి తన చెల్లెలు చికెన్ కర్రీ చేసి పంపింది.. అలానే తనకి ఫ్యామిలీ, ఫ్రెండ్స్ నుంచి మెసేజ్ వచ్చింది. నైనికకి వాళ్ల అమ్మ చేసిన ఇండ్లీ సాంబార్ చట్నీ వచ్చాయి.. వాళ్లిద్దరిలో ఎవరికి ఇవ్వాలో మీదే నిర్ణయం.. అంటూ బిగ్‌బాస్ ఫిట్టింగ్ పెట్టాడు.
నైనికకి తీసుకెళ్తా బిగ్‌బాస్ అంటూ పృథ్వీ అన్నాడు. నైనిక వాళ్ల అమ్మ రాసిన లెటర్‌లో మై ప్రిన్సెస్.. బిగ్‌బాస్ ఇంట్లో నీ ప్రతిక్షణం ఎంజాయ్ చెయ్.. నీ ఫైటింగ్ స్పిరిట్ అండ్ నమ్మకమే నిన్ను ముందుకు తీసుకెళ్తాయ్.. నువ్వు వారియర్‌వి నీ బలం చూపించు.. నీ ఫ్యాన్స్‌కి నీ డ్యాన్స్‌తో ఎంటర్‌టైన్ చెయ్.. నేను మీతో ఉన్నాం.. వెనకడుకు వేయకు అసలు.. బ్లో అండ్ గ్రో బిట్టు.. లోడ్స్ ఆఫ్ లవ్ అంటూ ఉంది.
Also Read:రేవంత్ మొనగాడు కాదు మోసగాడు: హరీశ్ రావు
తర్వాత మణికంఠను కన్ఫెషన్ రూమ్‌కి రండి అంటూ బిగ్‌బాస్ పిలిచాడు. ఖచ్చితంగా తనకి సంబంధించిన ఫుడ్ వస్తుందని ముందే ఊహించిన యష్మీ.. నీకు ఏం అనిపిస్తే అదే చెయ్ అంటూ మణికంఠకి సలహా ఇచ్చింది. పృథ్వీ, యష్మీ ఇంటి నుంచి వచ్చిన ఫుడ్ ఉంది నిర్ణయం మీదేనని బిగ్ బాస్ చెప్పగా పృథ్వీది తీసుకోపోతే గొంతు పిసకుతాడేమోనని భయంగా ఉంది అని చెప్పాడు మణికంఠ. తర్వాత పృథ్వీకి వాళ్ల మదర్ నుంచి వచ్చిన మెసేజ్ చూపించాడు బిగ్‌బాస్. నిన్ను బిగ్‌బాస్‌లో చూడటం నాకు చాలా ఆనందంగా ఉంది.. నువ్వు చాలా బాగా ఆడుతున్నావ్.. నువ్వు నా కొడుకువని చెప్పడానికి చాలా గర్వపడుతున్నా.. కానీ కోపం మాత్రం తగ్గించుకో లవ్ యూ సో మచ్ అంటూ అందులో రాసి ఉంది.
పృథ్వీ లెటర్ పూర్తికాగానే బై మిస్టేక్ యష్మీ కోసం వచ్చిన మెసేజ్ కూడా ప్లే అయిపోయింది. అయితే రెండు సెకన్లు మాత్రమే ఉండగా ఇలా చేయకండి బిగ్‌బాస్.. అంటూ ఏడ్చింది యష్మీ. తర్వాత నిఖిల్‌ను కన్ఫెషన్ రూమ్‌కి పిలిచాడు బిగ్‌బాస్. మీకు హౌస్‌లో ఇష్టమైన ఒకరి పేరు చెప్పాలనగానే పృథ్వీ అంటూ బదులిచ్చాడు. ఇంటి నుంచి వెళ్లిపోయినవాళ్లలో ఎవరు అని అడిగితే సోనియా అన్నాడు నిఖిల్. మీ ముందు ప్రేరణ నబీల్, సీతల నుంచి వచ్చిన ఫుడ్ ఉంది. దీనికి చాలా సేపు ఆలోచించి ప్రేరణకి తీసుకెళ్తా బిగ్‌బాస్ అంటూ నిఖిల్ చెప్పాడు. దీంతో బయటికి వచ్చిన వెంటనే నిఖిల్‌కి హగ్ ఇచ్చి ఎమోషనల్ అయింది ప్రేరణ.
ప్రేరణ కోసం తన భర్త లెటర్‌లో ఏం రాశారంటే? “డియర్ ప్రేరణ .. నువ్వు నీ బెస్ట్ ఇస్తున్నావ్.. చాలా బాగా ఆడుతున్నావ్.. నీ నిజమైన.. బబ్లీ.. పర్సనాలిటీతోనే నువ్వు ఉన్నావ్.. మన పెళ్లి అయ్యి పది నెలలు మాత్రమే అయింది.. కానీ ఈ షో నీకు ఎంత ముఖ్యమైనదో నేను అర్థం చేసుకున్నాను.. ఈ టైటిల్‌ను గెలుచుకోవడానికి పట్టుదలతో నువ్వు కృషి చేస్తున్నావ్.. నేను నిన్ను కలవలేకపోయినప్పటికీ నిన్ను చూసి గర్వపడుతున్నాను.. సీయూ సూన్ పుట్టు..” అంటూ రాసి ఉంది.
చివరగా విష్ణుప్రియ, యష్మీ, సీత, మణికంఠ, నబీల్ ఇంటి నుంచి వచ్చిన ఫుడ్‌ను మెసేజ్‌ను పొందలేకపోయారు.. అందుకే వారందరిలో నుంచి ఒకరికి ఫుడ్ , మెసేజ్‌ను పొందే అవకాశాన్ని మీ ద్వారా కల్పిస్తున్నాం అని చెప్పగా అందరూ కలిసి విష్ణుప్రియను సెలక్ట్ చేశారు. దీంతో తన ఇంటి నుంచి వచ్చిన చికెన్ బిర్యానీ విష్ణుకి దక్కింది.