Bigg Boss 8 Telugu:గంగవ్వకు గుండెపోటు!

2
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 8 తెలుగు విజయవంతంగా 8 వారాలు పూర్తి చేసుకోవడానికి వచ్చింది. ఇక 8వ వారంలో భాగంగా ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. వైల్డ్​ కార్డ్​ ద్వారా వచ్చి ప్రేక్షకులను బాగానే అలరిస్తోంది గంగవ్వ.

తాజా ఎపిసోడ్‌లో భాగంగా అందరూ పడుకున్న సమయంలో గంగవ్వ లివింగ్​ రూమ్​లోని సోఫా మీద కూర్చోని పెద్ద పెద్దగా అరుస్తూ దయ్యం పట్టినట్లుగా ఊగిపోయింది. దీంతో కంటెస్టెంట్లు హడావిడిగా వచ్చి గంగవ్వను చూసి తెగ టెన్షన్​ పడిపోయారు. ముఖ్యంగా నయ స్టోర్​ రూమ్​ కెమెరా ప్లీజ్​ రెస్పాండ్ అంటూ ఆందోళన చెందింది. చివరగా చిన్నగా బెడ్​ రూమ్​లోకి తీసుకెళ్లి పడుకోబెట్టారు. తీరా సీన్​ కట్​ చేస్తే ఇది ప్రాంక్​ అని వీడియోలో చెప్పారు.

టేస్టీ తేజ, అవినాష్ కు మాత్రమే ఈ విషయం తెలుసు. మిగితా హౌజ్​మేట్స్​ కి తెలియక పోవడంతో తెగ భయపడిపోయారు.

Also Read:Bigg Boss 8 Telugu: హరితేజను సేవ్ చేసిన గౌతమ్

- Advertisement -