Bigg Boss 8 Telugu: ఐదోవారం నైనిక ఎలిమినేట్

4
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 7 తెలుగు విజయవంతంగా 5 వారాలు పూర్తి చేసుకుంది. తాజా వారంలో భాగంగా ఇంటి నుండి ఎలిమినేట్ అయ్యారు నైనిక. మణికంఠ, నైనిక చివరి వరకూ డేంజర్ జోన్‌లో ఉండగా తక్కువ ఓటింగ్‌తో నైనిక ఎలిమినేట్ కాక తప్పలేదు.

తొలుత నామినేషన్స్‌లో ఉన్న మణికంఠ, నైనిక, విష్ణుప్రియలను నిల్చోబెట్టారు. వీరి నుంచి విష్ణుప్రియను సేవ్ చేశారు. ఆ తర్వాత బిగ్ ట్విస్ట్ ఇస్తు ఇవాళ వైల్డ్ కార్డ్స్ రాబోతున్నారు అని చెప్పారు. తర్వాత డేంజర్ జోన్‌లో ఉన్న మణికంఠ-నైనికలను కాస్త టెన్షన్ పెట్టి చివరికి నైనిక ఎలిమినేట్ అంటూ నాగ్ అనౌన్స్ చేశారు. మణికంఠ మళ్లీ సేవ్ అయ్యాడని తెలిసి ప్రేరణ, యష్మీ సహా అందరూ షాకయ్యారు. థాంక్యూ ఆడియన్స్ మీరు అర్థం చేసుకున్నట్లు నన్ను ఎవరూ అర్థం చేసుకోలే అంటూ మణి చెప్పాడు.

తర్వాత నైనిక వెళ్లిపోతుంటే మిస్ యూ నైనూ అంటూ సీత గట్టిగానే ఏడ్చింది. తర్వాత స్టేజ్ మీదకి రాగానే నైనిక జర్నీ వీడియో చూపించారు నాగ్. ఓ డైరీ ఇచ్చి అందులో ఉన్న ట్యాగ్స్ ఒక్కొక్కరికీ ఇవ్వాలంటూ నాగ్ చెప్పారు. దీంతో మ్యానుపులేటర్ అనే ట్యాగ్ ప్రేరణ‌కి ఇచ్చింది నైనిక. వెన్నుపోటు పొడిచే వ్యక్తి అనే ట్యాగ్ మణికంఠకి ఇచ్చింది. విష్ణు ఫేక్ ఫ్రెండ్ అని… అటెన్షన్ సీకర్.. పృథ్వీకి, అవకాశవాది.. నబీల్‌కి, రియల్ ఫ్రెండ్.. సీతకి, గేమ్ ఛేంజర్.. నిఖిల్‌కి, మంద బుద్ధి.. యష్మీ‌కి ఇచ్చింది.

ఇక బిగ్‌బాస్ హౌస్ నుంచి ఇప్పటికే ఐదుగురు ఎలిమినేట్ అయిపోయిన సంగతి తెలిసిందే. బేబక్క, శేఖర్ బాషా, అభయ్ నవీన్, సోనియా,ఐదో వారం మిడ్ వీక్ ఎలిమినేషన్‌లో ఆదిత్య ఓం ఔట్ అయ్యాడు. ఇక తాజాగా నైనిక ఎలిమినేట్ కావడంతో ఇంటి నుండి ఆరుగురు ఎలిమినేట్ అయ్యారు.

- Advertisement -