బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 8 తెలుగు విజయవంతంగా 70 రోజులు పూర్తి చేసుకుంది. తాజా ఎపిసోడ్‌లో భాగంగా 10వ వారం ఇంటి నుండి ఎలిమినేట్ అయింది హరితేజ. సన్ డే ఫన్ డేగా సాగగా నామినేషన్స్‌లో ఉన్న ఒక్కొక్కొరినీ సేవ్ చేస్తూ వచ్చారు నాగార్జున. చివరిగా యష్మీ-హరితేజ మిగలగా ఎవిక్షన్ ఫ్రీ షీల్డ్ గెలుచుకున్న నబీల్‌ని కూడా పిలిచారు. ఎలిమినేషన్ రౌండ్ మొదలయ్యేముందు షీల్డ్‌ను ఉపయోగిస్తావా అంటూ నబీల్‌ను అడిగారు నాగార్జున. కానీ దీనికి నబీల్ ఇప్పుడు ఉపయోగించను అన్నాడు. దీంతో ఎలిమినేషన్ రౌండ్ స్టార్ట్ చేయగా హరితేజ ఎలిమినేట్ అయింది. ఇది ప్రకటించిన వెంటనే తన ఫ్రెండ్ యష్మీ సేవ్ అయినందుకు ప్రేరణ గట్టిగా అరిచింది. వెళ్తూ వెళ్తూ నిఖిల్‌కి మాత్రం ఓ ఫ్లయింగ్ కిస్ ఇచ్చింది హరితేజ.
కట్ చేస్తే స్టేజ్ మీదకి రాగానే హరితేజ జర్నీ వీడియో ప్లే చేశారు నాగార్జున. అంతా చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంది కానీ చివరిలో మాత్రం హరితేజకి తన కూతురు వీడియో ప్లే చేసి ఏడిపించేశాడు బిగ్‌బాస్. వెళ్లేముందు హౌస్‌లో ఐదుగురు మాస్కులు తీసేయమని నాగార్జున అన్నారు. అంటే ఇంకా నటిస్తూ వాళ్ల ఒరిజినాలిటీ చూపించని వారి గురించి నాగార్జున అడిగారు.
దీనికి ముందుగా అవినాష్ మాస్క్ తీసేసింది హరితేజ. అవినాష్ నవ్విస్తూ మా మనసుల్ని గెలుచుకున్నావు కానీ నీ ఎమోషన్స్ ఏంటి.. కోపం ఏంటి ఆవేశం ఏంటి.. ఇవన్నీ కూడా కనిపిస్తే బావుంటుంది అని చెప్పింది. ఆ తర్వాత రోహిణి మాస్క్ తీసేసింది హరితేజ. తర్వాత తేజ పేరు చెప్పింది హరితేజ. తేజ.. మాస్క్ తీయాలని కాదు సార్.. కానీ ఒక్కటే చెప్పాలనుకుంటున్నా రూల్స్ చెప్పడం కాదు.. పాటించు అని చెప్పింది. తర్వాత మెగా చీఫ్ ప్రేరణ పేరు చెప్పింది. చివరిగా నిఖిల్ పేరు చెబుతూ కొన్ని సలహాలు ఇచ్చింది. నువ్వు ఇప్పటికైనా ఆ ముసుగు తీసెయ్.. నీ ఎమోషన్స్‌ను అలా దాచుకోకు.. ఎమెషన్స్ చూపించడం తప్పేం కాదు.. నీకు కోపం వచ్చినప్పుడు కోపపడు.. బాధ వచ్చినప్పుడు ఏడు.. అది కూడా ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు అని చెప్పి బిగ్ బాస్‌కు బైబై చెప్పేసింది.
Also Read:మైటా వార్షికోత్సవాల్లో బీఆర్ఎస్ నాయకులు