Bigg Boss 8 Telugu: గౌతమ్ వర్సెస్ నిఖిల్

2
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 8 తెలుగు విజయవంతంగా 96 రోజులు పూర్తి చేసుకుంది. తాజా ఎపిసోడ్‌లో భాగంగా గత వారం గోల్డెన్ టికెట్ గెలిచినవారికి ఈ వారం ఓ ప్రయోజనం కల్పించాడు బిగ్‌బాస్. లాస్ట్ వీకెండ్‌లో గోల్డెన్ టికెట్ వచ్చినందుకు గౌతమ్, నిఖిల్, రోహిణి మీ ముగ్గురిలో నుంచి ఒకరికి మాత్రమే ఈరోజు ఓట్ అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది అని చెప్పాడు బిగ్ బాస్. ఆ ఒక్కరు ఎవరో తెలుసుకోవడానికి మీకు 8 రాసి ఉన్న ఒక కేక్ ఇస్తాం.. ఈ ఛాలెంజ్‌లో గెలవడానికి కేకును కట్ చేస్తూ 8న కింద పడకుండా చూడటం.. ఎవరు కేక్ కట్ చేస్తున్నప్పుడు 8 నెంబర్ కిందపడిపోతుందో వాళ్లు ఓట్ అప్పీల్ రేసు నుంచి తప్పుకోవాల్సి ఉంటుందిని చెప్పాడు. ఈ ఛాలెంజ్‌లో రోహిణి ఔట్ కాగా నిఖిల్-గౌతమ్ నెక్ట్స్‌ రౌండ్‌కి వెళ్లిపోయారు.

ఆ తర్వాత నిఖిల్-గౌతమ్‌కి మరో ఫిజికల్ టాస్కు పెట్టాడు బిగ్‌బాస్. నిఖిల్-గౌతమ్.. మీ ఇద్దరిలో ఒకరికి ఓట్ అప్పీల్ చేయడానికి అవకాశాన్ని కల్పిస్తూ ఇస్తున్న చివరి ఛాలెంజ్ రంగుపడుద్ది.. ఈ ఛాలెంజ్‌లో గెలవడానికి మీరు చేయవల్సందల్లా మీ ప్రత్యర్థి టీ షర్ట్‌పైన ఎక్కువ రంగు ఉండేలా చూసుకోవడం.. ఈ ఛాలెంజ్ మూడు రౌండ్స్‌లో జరుగుతుంది.. అన్ని రౌండ్స్ పూర్తయ్యేసరికి టీ షర్ట్ పైన తక్కువ రంగు ఉన్న సభ్యుడు ఈ ఛాలెంజ్‌ని గెలిచి ఆడియన్స్‌తో కనెక్ట్ అయి ఓట్ అప్పీల్ చేసుకునే అవకాశం ఇస్తానని చెప్పారు.

ఇద్దరూ చాలా గట్టిగా ఆడారు. ముఖ్యంగా గౌతమ్ కాలు పట్టుకొని నిఖిల్ లాగిపడేశాడు. దీంతో గౌతమ్ కూడా ఫిజికల్ అయి రంగు రాయడానికి చాలా ట్రై చేశాడు. దీంతో గౌతమ్ నువ్వు కొడుతున్నావ్.. అంటూ రౌండ్ ముగిసిన వెంటనే నిఖిల్ ఆరోపించాడు. మొత్తంగా ఈ టాస్క్‌లో నిఖిల్ గెలవగా ఓటు అప్పీల్ చేసుకునే అవకాశం లభించింది.

Also Read:అల్సర్ ఉందా.. అల్లంతో జాగ్రత్త!

- Advertisement -