Bigg Boss 8 Telugu Day 93: నిఖిల్‌ని ఓడించిన ప్రేరణ

6
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 8 తెలుగు విజయవంతంగా 93 రోజులు పూర్తి చేసుకుంది. తాజా ఎపిసోడ్‌లో హౌస్‌మేట్స్‌కి ఓట్ అప్పీల్ చేసుకునే అవకాశం ఇచ్చాడు బిగ్ బాస్. ఈ అవకాశాన్ని సంపాదించుకోవడానికి కొన్ని ఛాలెంజెస్‌లో పాల్గొని గెలవాల్సి ఉంటుందని.. అలాగే ఎవరికైతే జంట లేరో వారు ఈ ఓట్ అప్పీల్ రేసు నుంచి తప్పుకోవాల్సి ఉంటుందని చెప్పాడు.

నాతో ఆడాలనుకుంటున్న ప్రతి ఒక్కరూ ప్లీజ్ నా దగ్గరికొచ్చి ఎందుకు అవ్వాలనుకుంటున్నారో నాకు చెబితే మనం అది డిస్కస్ చేసుకొని వాళ్లు ఎవరైనా కానీ నాకు ఓకే అనిపించిన పర్సన్‌తో నేను వెళ్లాలనుకుంటున్నా అని చెప్పగా అదేదో నీకు ఓకే అనిపించే పర్సన్‌ను నువ్వే సెలక్ట్ చేసుకో అంటూ రోహిణి పంచ్ ఇచ్చింది. ప్రేరణ.. నిఖిల్‌ని సెలక్ట్ చేసుకోగా నబీల్ అవినాష్‌ను, రోహిణి..విష్ణు పేరు చెప్పింది. దీంతో గౌతమ్ ఖాళీగా మిగిలిపోయాడు. అయితే సడెన్‌గా అవినాష్‌ ఎలాగూ ఫైనల్‌కి చేరాడు కాబట్టి గౌతమ్‌ని చేర్చుకుంటా అని చెప్పగా ఓకే చెప్పేశాడు అవినాష్.

విష్ణప్రియ-రోహిణి, నిఖిల్-ప్రేరణ, గౌతమ్-నబీల్ జంటగా ఆడగా అవినాష్ సంచాలక్‌గా ఉన్నాడు. ఈ గేమ్ ప్రకారం ప్రతి టీమ్ ఒక టవర్‌ని నిర్మిస్తారు.. తర్వాత ఆ టవర్‌ని వేరే టీమ్ వాళ్లు బాల్స్‌తో కొట్టి పడేయడానికి ట్రై చేస్తార.. వీళ్లు కాపాడుకోవాలి.. బజర్ మోగే సరికి ఎవరి టవర్ పెద్దగా ఉంటే ఆ టీమ్ విన్. ఇక ఈ గేమ్‌లో ప్రేరణ-నిఖిల్ జోడీ విన్ అవ్వగా సెకండ్ ప్లేస్‌లో రోహిణి-విష్ణుప్రియ జంట నిలిచింది. చివరి ప్లేస్‌లో ఉన్న గౌతమ్-నబీల్ ఈ రేసు నుంచి తప్పుకున్నారు.

మొదటి ఛాలెంజ్‌లో గెలిచిన ప్రేరణ-నిఖిల్ ఇద్దరూ రెండో పోటీకి అర్హత సాధించారు. కానీ సెకండ్ ప్లేస్‌లో ఉన్న రోహిణి-విష్ణుప్రియల నుంచి కేవలం ఒక్కరికే తర్వాతి ఛాలెంజ్‌లో పాల్గొనే అవకాశం ఉందంటూ బిగ్‌బాస్ చెప్పాడు. దీంతో విష్ణు …రోహిణికి ఛాన్స్ ఇవ్వగా టక్ టకాటక్ అనే ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. టాస్కులో నిఖిల్-రోహిణిలను ఓడించి ప్రేరణ గెలిచేసింది. దీంతో ప్రేరణకు ఓటు అప్పీల్ చేసుకునే అవకాశం ఇవ్వగా తాను బిగ్ బాస్‌కు ఎందుకు వచ్చాను అని వివరంగా చెప్పింది.

Also Read:తెలుగు రాష్ట్రాల్లో భూకంపం..5.3గా భూకంప తీవ్రత

- Advertisement -