బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 8 తెలుగు విజయవంతంగా 88 రోజులు పూర్తి చేసుకుంది. తొలుత టికెట్ టూ ఫినాలే టాస్కులు నిర్వహించేందుకు మాజీ కంటెస్టెంట్లు పునర్నవి, వితికా శేరు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అందరినీ ఆప్యాయంగా పలకరించారు. ఆ తర్వాత టికెట్ టూ ఫినాలేకి ఆఖరి కంటెండర్‌ని సెలక్ట్ చేయాల్సిన బాధ్యత మీపై ఉంది అంటూ వితికా-పునర్నవికి బిగ్‌బాస్ చెప్పాడు. ఇద్దరూ కలిసి నిఖిల్-గౌతమ్‌ని సెలక్ట్ చేయగా వాళ్లు మరో ఇద్దరిని సెలక్ట్ చేసుకోవాల్సి వచ్చింది. గౌతమ్ ..ప్రేరణ పేరు చెప్పగా, నిఖిల్.. పృథ్వీ, తేజ అంటూ ఇద్దరి పేర్లు చెప్పాడు. చివరగా ఫైనల్ చేసింది పృథ్వీ-ప్రేరణ పేర్లు.
తర్వాత నలుగురికి ‘జారుతూ గెలువు’ అనే టాస్కు పెట్టాడు బిగ్‌బాస్. ఈ ఛాలెంజ్‌లో గెలవాలంటే కంటెస్టెంట్లు స్లైడ్ పైకి తాడు సహాయంతో వెళ్లి స్లైడ్ పైన ఉన్న డిస్కులను తీసుకొని వారికి చెందిన బాస్కెట్లో వేయాలి. ఇలా ఎవరైతే ఎక్కువ డిస్కులు సేకరిస్తారో వాళ్లు విన్నర్. ఈ టాస్కులో పృథ్వీ అద్భుతంగా ఆడాడు. గేమ్ కంప్లీట్ అయిన వెంటనే ఎవరు విన్నర్ అనే విషయంలో వితికా-పునర్నవి మధ్య చర్చ జరిగింది. డిస్క్‌లు కౌంట్ చేయగా పృథ్వీ బాస్కెట్లో 10 ఉన్నాయి..అయితే పృథ్వీ విన్ అయినా ఫౌల్ గేమ్ ఆడాడని సెకండ్‌లో ఉన్న నిఖిల్‌కి ఫస్ట్ ప్లేస్ ఇద్దామని డిసైడ్ అయ్యారు.
సెకండ్ గేమ్‌కి వెళ్లే ముందు బిగ్‌బాస్ ఓ షాకిచ్చాడు. ఈ గేమ్‌లో నలుగురు పోటీదారులు ఆడటానికి వీల్లేదు. ఈ నలుగురి నుంచి ఒకరికి బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చి రేసు నుంచి తప్పించండి అంటూ బిగ్‌బాస్ చెప్పాడు.చాలా సేపు ఆలోచించి ప్రేరణను తొలగించగా ఆమె షాకైంది. రెండో గేమ్ లో భాగంగా మూడు టేబుల్స్ ఏర్పాటు చేశారు. అందులో ఎక్కువ పిన్స్ ఉన్న టేబుల్ నిఖిల్‌కి, కొంచెం తక్కువ ఉన్న టేబుల్ పృథ్వీకి, ఇంకొంచెం తక్కువ పిన్స్ ఉన్న టేబుల్ గౌతమ్‌కి ఇచ్చాడు బిగ్‌బాస్. ఇప్పుడు టేబుల్ మీదకి బాల్ వేయాలి.. అది కిందకి వచ్చే సమయంలో బిగ్‌బాస్ ఐ (కన్ను) ఫొటోని అరేంజ్ చేయాలి. నిఖిల్ టేబుల్‌కి ఎక్కువ పిన్స్ ఉండటంతో బాల్ కిందకి రావడానికి టైమ్ పడుతుంది. దీంతో ఆటోమేటిక్‌గా నిఖిల్ ఈ గేమ్‌లో గెలిచి టికెట్ టూ ఫినాలే రేసులోకి వచ్చేశాడు.
Also Read:Bigg Boss 8 Telugu: తప్పు చేసి రేసు నుండి నబీల్ ఔట్