బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 8 తెలుగు విజయవంతంగా 87 రోజులు పూర్తి చేసుకుంది. తాజా ఎపిసోడ్‌లో నబీల్‌కు పెద్ద దెబ్బ పడింది. తొలుత అవినాష్- తేజ మధ్య ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరిగింది. ఆ తర్వాత హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు మానస్-ప్రియాంక జైన్.
ఆ తర్వాత టికెట్ టూ ఫినాలే టాస్కులు ఆడేందుకు ఇద్దరు కంటెండర్లను సెలక్ట్ చేయాలని బిగ్‌బాస్ చెప్పాడు. ప్రేరణ, నబీల్ ఇద్దరినీ కంటెండర్‌షిప్ గెలిచేందుకు పోటీదారులుగా సెలక్ట్ చేశారు. ఈ టాస్కులు ఆడేందుకు నలుగురు కావాలని..కనుక నబీల్-ప్రేరణ ఇద్దరూ మాట్లాడుకొని మరో ఇద్దరి పేర్లు కూడా చెప్పాలంటూ బిగ్‌బాస్ చెప్పాడు. చివరగా పృథ్వీ-అవినాష్ పేర్లు ఫైనల్ చేశారు.
ఆ తర్వాత సుడోకు టాస్కులో ముందుగా ఎవరైతే ఎటు నుంచి చూసినా 15 వచ్చేలా నంబర్లను సెట్ చేస్తారో వాళ్లు విన్నర్ అంటూ బిగ్‌బాస్ చెప్పాడు. ఇక ఈ గేమ్ మొదలైన క్షణాల్లోనే నబీల్ నాది అయిపోయింది అంటూ గంట కొట్టేసి తెగ గెంతులేశాడు. కానీ తీరా వెళ్లి చూస్తే నబీల్ మొత్తం తప్పులు పెట్టాడు.
రెండో టాస్కు స్కోర్ బోర్డుపై బంతిని బ్యాలెన్స్ చేస్తూ ఎవరు ఎక్కువ రన్స్ చేస్తే వాళ్లు విన్నర్. ఇందులో భాగంగా బంతిని రన్స్ ఉన్న హోల్స్‌లోకి పడేయాలన్నమాట. నబీల్ తనకి ఇచ్చిన నాలుగు బాల్స్ సిక్సర్లుగా మార్చడంతో 24 పరుగులు చేశాడు. పృథ్వీ 5 బాల్స్ సిక్సర్లు కొట్టడంతో 30 పరుగులు వచ్చాయి.
Also Read:RGV: ఎక్కడికీ పారిపోలేదు.. తప్పు చేస్తే జైలుకెళ్తా
ఆ తర్వాత ఆడిన ప్రేరణకి 6 బాల్స్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఇందులో ఒక బంతి వేస్ట్ కాగా మిగిలిన 5 బంతులకి 5 సిక్సర్లు కొట్టింది. దీంతో పృథ్వీతో సమానంగా 30 పరుగులు వచ్చాయి. ఈ టాస్కులో విజేతగా నిలిచాడు అవినాష్. రెండు టాస్కుల్లోనూ గెలిచి సత్తా చాటాడు.