బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 8 తెలుగు విజయవంతంగా 81 రోజులు పూర్తి చేసుకుంది. నలుగురు చీఫ్ కంటెండర్లు సెలక్ట్ అయిన తర్వాత మిగిలిన ఒక్క ప్లేస్‌కి నిఖిల్-రోహిణి మిగిలారు. వీరి విషయంలో మాత్రం హౌస్ మెజార్టీ ప్రకారం డెసిషన్ తీసుకోవాలని బిగ్ బాస్ చెప్పగా దీంతో హౌస్‌మేట్స్‌కి ఇద్దరూ అప్పీల్ చేసుకున్నారు. తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నా అంటూ నిఖిల్ అడిగాడు. ఒక్కసారి కూడా మెగా చీఫ్ అవ్వలేదు.. అవకాశం వస్తే చీఫ్‌గా నేనేంటో చూపిస్తా అంటూ రోహిణి చెప్పింది.
ముందుగా గౌతమ్ మాట్లాడుతూ తన సపోర్ట్ రోహిణికే అని చెప్పాడు. యష్మీ, ప్రేరణ ఇద్దరూ నిఖిల్ ఇప్పటికే చీఫ్ అయ్యాడు.. అవ్వలేని వాళ్లు అవ్వాలని కోరుకుంటున్నా అందుకే రోహిణికి సపోర్ట్ చేస్తున్నా అంటూ చెప్పారు. తర్వాత విష్ణుప్రియ, పృథ్వీ, నబీల్ ముగ్గురూ నిఖిల్‌కి సపోర్ట్ చేయగా అవినాష్, తేజ, గౌతమ్, యష్మీ, ప్రేరణ ఐదుగురు సపోర్ట్ చేయడంతో రోహిణి మెగా చీఫ్ కంటెండర్ అయింది.
తర్వాత పృథ్వీ క్లారిటీ ఇచ్చే ప్రయత్నంలో గొడవ స్టార్ట్ అయింది. మీరంతా కలిసి గ్రూప్ గేమ్‌యే కదా ఆడతారు.. వైల్డ్ కార్డ్స్‌ని పంపించేయాలని గ్రూప్‌గా ఆడుతున్నారు.. అంటూ గౌతమ్ అన్నాడు. దీనికి ఎవరు గ్రూప్‌గా ఆడారు.. ఫ్రెండ్‌షిప్‌ని గ్రూప్‌గా అనుకుంటే మేమేం చేయలేం అంటూ రిప్లయ్ ఇచ్చాడు పృథ్వీ. దీంతో కనిపించేదాన్ని ఎవరూ కనుమరుగు చేయలేరు అంటూ డైలాగ్ కొట్టాడు గౌతమ్. గొడవ పెద్దది కావడంతో పృథ్వీని పక్కకి లాక్కెళ్లి చెవిలో ప్రేరణ ఓ సలహా ఇచ్చింది. వాడికి అనవసరంగా స్కోప్, ఫుటేజి ఇవ్వకు అంటూ ప్రేరణ అంది. అప్పటికే కోపంలో ఉన్న పృథ్వీ.. వాడికి స్కోప్ ఇచ్చేదేంటి అంటూ గట్టిగా అన్నాడు. ఇక దాన్ని పట్టుకున్న గౌతమ్.. వాడు వీడు ఏంటి సారీ అడుగు.. రౌడీయిజం చేయడానికి వచ్చావా అంటూ అరిచాడు.
ఇక పృథ్వీ గురించి రోహిణి, అవినాష్, తేజ కాసేపు డిస్కస్ చేసుకున్నారు. ఆ తర్వాత అక్కడ బొమ్మలకి వేసిన టీ షర్ట్స్ దగ్గరికెళ్లి చూసేసరికి.. విష్ణుప్రియ బొమ్మకి వేసిన టీ షర్ట్‌కి చిన్న బొక్క ఉందని రోహిణి కనిపెట్టింది. తర్వాత ఐదుగురు చీఫ్ కంటెండర్లకి ఓ టాస్కు పెట్టాడు బిగ్‌బాస్. పట్టువదలని విక్రమార్కులు అంటూ పెట్టిన ఈ టాస్కు ప్రకారం.. కంటెండర్లు ఐదుగురు.. ఐదు డబ్బాలపై నిల్చొని ఉంటారు.. సంచాలక్ వేసిన డైస్‌లో ఏ కలర్ వస్తే ఆ కలర్‌లో ఉన్న నచ్చిన డ్రమ్‌ని సంచాలక్ తీసేయొచ్చు. అప్పుడు కంటెండర్లు తమ పక్క ప్లాట్ ఫామ్‌పైకి వెళ్లి ఔట్ కాకుండా ఆడాలి ఇలా ఎవరైతే చివరి వరకూ ఉంటారో వాళ్లకి ఎక్కువ పాయింట్లు వస్తాయి అని చెప్పగా రోహిణి మెగా చీఫ్ అయింది.
Also Read:పవన్ ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ ఇదే!