Bigg Boss 8 Telugu: నాకు ఓట్లేయకండి..బయటకు వస్తా!

3
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 8 తెలుగు విజయవంతంగా 80 రోజులు పూర్తి చేసుకుంది. తాజా ఎపిసోడ్‌లో భాగంగా నిఖిల్ హైలైట్‌గా నిలిచాడు. తొలుత నిఖిల్.. యష్మీతో పర్సనల్‌గా మాట్లాడాడు. గేమ్ కోసం.. నువ్వు ట్రాప్‌లో పడొద్దు వాడుకుంటున్నాడు అన్నట్లు.. నీకెప్పుడైనా నిన్ను గేమ్ పరంగా వాడుకుంటున్నా.. లేదా వేరే విధంగా అనిపించిందా అని అడిగాడు నిఖిల్. నాకు అనిపించలేదు అనగా ఆ ముక్క అక్కడ చెప్పొచ్చుగా.. అంటూ యష్మీకి సూచించాడు నిఖిల్.

హోప్ అనేది ఎలా మీనింగ్ వస్తది అంటే నేను కూడా నువ్వు చెప్పిన దానికి రియాక్ట్ అయి లైక్ చేస్తున్నా, ఒప్పుకుంటున్నా అనే అర్థం వస్తది అని యష్మీతో చెప్పాడు నిఖిల్ . దీనికి మన ఇద్దరి మధ్య లైకింగ్ అనేది లేదు.. నేను కూడా సీత చెప్పినప్పుడు స్ట్రక్ అయ్యా.. నీవైపు చూశా.. నువ్వు నిల్చొని మాట్లాడతావని అనుకున్నా.. కానీ నువ్వు మాట్లాడలేదు.. అయినా నేను ఎంతవరకూ చెప్పగలోనో అంతవరకూ చెప్పాను.. అక్కడ నా గేమ్ కూడా మొత్తానికి పోయింది.. ఈ వారం నేను వెళ్లిపోతానేమో.. అంటూ యష్మీ అంది. దీనికి నేను కూడా పోవచ్చు చెప్పలేను అంటూ నిఖిల్ అన్నాడు.

యష్మీ వెళ్లిపోయాక నిఖిల్ కెమెరాతో మాట్లాడాడు. బిగ్‌బాస్ నేను ఇక్కడికి వచ్చినప్పుడు నాకు కొంతమందే తెలుసు.. వాళ్లతో కలిసి ఒకరిన తొక్కి ఆడాలని ఎప్పుడూ అనుకోలేదు.. నామినేషన్స్‌లో సీత చెప్పినట్లు స్ట్రాంగ్ ఉమెన్‌ని వాడుకొని నేన గేమ్‌లో గెలవాలని అనుకోలేదు అన్నాడు. ఒకరిని తొక్కి వాడుకొని ఈ షో గెలవాలని నేన రాలేదు.. నన్న ఇప్పటివరకూ సేవ్ చేసి నన్ను ఇష్టపడిన నాకోసం ఓట్ చేసిన వారందరికీ థాంక్యూ సో మచ్.. ఈ వీక్ నామినేషన్‌లో ఉన్నా.. గివప్ ఇవ్వట్లేదు.. వద్దనిపిస్తుంది.. వెళ్లిపోవాలనిపిస్తుంది అని రిక్వెస్ట్ చేశాడు.

ఆ కాసేపటికే నబీల్ , పృథ్వీ అక్కడికి వచ్చి నిఖిల్‌లో కాస్త జోష్ నింపారు . దీంతో నిఖిల్ మనసు మార్చుకొని మరోసారి కెమెరాతో మాట్లాడాడు. ఆడియన్స్ ఇంకా మంచిగా ఆడి నేనేంటో ప్రూ చేసుకునే బయటికొస్తా.. మీ సపోర్ట్ ఎప్పుడూ కావాలి అని చెప్పాడు నిఖిల్. మొత్తంగా ఈ ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచాడు.

Also Read:Bigg Boss 8 Telugu: కర్మ ఈజ్ బ్యాక్

- Advertisement -