Bigg Boss 8 Telugu Day 8: సోనియాకి కౌంటర్ ఇచ్చిన విష్ణు ప్రియ,సీత..పోటిపడి మరి రెచ్చిపోయారు!

13
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 విజయవంతంగా 8 రోజులు పూర్తి చేసుకుంది. రెండో వారం నామినేషన్ ప్రక్రియ హాట్ హాట్‌గా సాగింది. ఈ క్రమంలో సోనియా, విష్ణు ప్రియ, సీత మధ్య వార్ నెలకొంది.

ఇక ఈ వారం నామినేషన్‌లో యష్మీకి మరోసారి అదిరిపోయే ఆఫర్ ఇచ్చాడు బిగ్ బాస్. ప్రతి సభ్యుడు ఇతర టీమ్‌లోని ఇద్దరు సభ్యులను నామినేట్ చేసి తగిన కారణాలు చెప్పాలని.. తర్వాత వారి తలపైన పెయింట్ నీళ్లు పోయాలని చెప్పాడు బిగ్ బాస్. అయితే యష్మీ పెద్ద టీమ్‌కి చీఫ్ కావడం వల్ల ఆమెను ఎవరూ నామినేట్ చేయకూడదని చెప్పడంతో రెండో వారం ఎలిమినేషన్ నుండి తప్పించుకుంది యష్మీ.

ఇక నామినేన్స్‌లో సోనియా – సీత మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. సీతను నామినేట్ చేస్తూ..నీకు టాస్కే అర్థం కాలేదని నాకు క్లియర్ గా అర్థమైంది.. అందుకే చెత్త బుట్ట గురించి పనుల గురించి కంప్లెయింట్ చేస్తున్నాం. అయినా ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే ముందు మీ చీఫ్‌కి చెప్పాలి.. ఇక్కడ కాదు అంటూ సోనియా చెప్పింది.

తనకు క్లారిటీ ఉందని .. నాకు నొప్పొస్తే నేను చెబుతా.. మీ దాంట్లో మీకు నొప్పేస్తే మీ చీఫ్‌ దగ్గరికెళ్తారేమో అంటూ సీత కౌంటర్ ఇచ్చింది. ఆ తర్వాత మీ గ్రూపంతా ఫెయిల్ అయ్యారు.. అయినా ఇండివీడ్యూయల్‌గా చెప్పుకుంటే ఇంకేంది బిగ్‌బాస్.. అంటే బిగ్‌బాస్ పిచ్చోడా అంటూ అరుస్తూనే ఉంది సీత. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.

తర్వాత విష్ణుప్రియను నామినేట్ చేసింది సోనియా . లాస్ట్ వీక్ జరిగిన నిఖిల్ ఇష్యూ గురించి రెయిజ్ చేస్తూ నేను అన్న దానికి సారీ చెప్పా కానీ నాపైన అడల్ట్రీ అనే ముద్ర వేశారు అంటూ విష్ణు అడిగింది. ఆ తర్వాత విష్ణుప్రియపై పర్సనట్ అటాకింగ్ చేసింది సోనియా. బట్టలు సరిగ్గా వేసుకొని ఒక మనిషి పక్కన నిల్చోవాలన్నది కూడా నీకు తెలీదు అంటూ మాట్లాడింది. మొత్తంగా 8వ రోజు ముగ్గురు హైలైట్‌గా నిలిచారు.

Also Read:‘దేవర’.. ప్రీ సేల్స్‌ అదుర్స్!

- Advertisement -